తెలంగాణ

ఎండిన జలాశయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరాల నుంచి సాగర్ వరకూ.. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి సింగూర్ దాకా ఒకే పరిస్థితి
కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిల్వల కరవు ప్రత్యామ్నాయ చర్యలకు 300 కోట్లు విడుదల

హైదరాబాద్: వేసవి ప్రారంభం కాకముందే రాష్ట్రంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎండలు ముదిరేసరికి ప్రజలు గక్కెడు మంచినీటి కోసం కటకటలాడే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోగా, మరోవైపు మంచినీటి అవసరాలను తీర్చే జలాశయాలు మునుపెన్నడూ లేని విధంగా ఎండిపోయాయి. దీంతో మున్ముందు తీవ్రతరం కాబోతున్న మంచినీటి ఎద్దడి సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు, ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ. 300కోట్లు విడుదల చేసింది. మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఇలా ఉండగా రాష్ట్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జూరాల ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ వరకు, అలాగే గోదావరి పరీవాహక ప్రాంతంలో శ్రీరామ్‌సాగర్ నుంచి సింగూర్ వరకు దాదాపు అన్ని జలాశయాలలోనూ నీటిమట్టం డెడ్‌స్టోరేజి కంటే దిగువకు పడిపోవడం తీవ్ర అందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోవడంతో మంచినీటి ఎద్దడితో పాటు విద్యుదుత్పత్తిపైనా ప్రభావం పడబోతోంది.
జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం (్ఫల్ రిజర్వాయర్ లెవల్) 11.94 టిఎంసిలు కాగా, ప్రస్తుతం కేవలం 3.80 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 42.02 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 128.63 టిఎంసిల నీటిమట్టానికి పడిపోయింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 90.31 టిఎంసిలు కాగా ప్రస్తుతం దీంట్లో 5.46 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఇక నిజాంసాగర్, ఎల్‌ఎండి, సింగూర్ జలాశయాల్లోనూ నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించే మంజీరా జలాశయంలో నీటిచుక్క లేకుండా పూర్తిగా ఎండిపోయింది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరేనాటికి జనం దాహార్తితో అల్లాడే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

జలాశయాల్లో నీటిమట్టాలు (టిఎంసిలలో)

రిజర్వాయర్ పూర్తిగా ప్రస్తుతం గత ఏడాది
జూరాల 011.94 003.80 009.64
శ్రీశైలం 215.81 042.02 053.76
నాగార్జునసాగర్ 312.00 128.63 160.00
శ్రీరామ్‌సాగర్ 090.31 005.46 014.78
లోయర్ మానేరు 024.07 003.07 006.86
నిజాంసాగర్ 017.80 000.56 001.08
సింగూర్ 029.91 000.69 008.42

చిత్రం... ఎండిపోయన సింగూర్ జలాశయం