తెలంగాణ

మీరు శిక్ష వేస్తారా..! మమ్మల్నే వేయమంటారా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక: ‘నా బిడ్డను పాడుచేసిన వాళ్లకు శిక్షలు వేస్తారా? మమ్మల్ని వేయమంటారా? దోషుల కుటుంబీకులు డబ్బు సంచులతో పోలీస్ స్టేషన్లకు వస్తుండ్రు, ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు, పోలీసుల బిడ్డలైతే ఇలానే స్పందిస్తారా?’ అంటూ అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు బోయిని ఉమాదేవి, ప్రభుదాస్ మంగళవారం వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్ బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఎదుట గోడును విలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మాకు నలుగురు అమ్మాయిలు. పెద్దది అత్యాచారానికి గురైంది. ఒక అమ్మాయి వికలాంగురాలు. మేము కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నాం’ అంటూ బోరున విలపించారు. ఇదేనా ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం చేసే న్యాయం అని ప్రశ్నించారు. పెళ్లయినవాడు మైనర్ ఎలా అవుతాడని? పోలీస్ శిక్షణకు ఎలా అర్హుడవుతాడని? కేసును పోలీసులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. జరిగిన దారుణంపై దోషులను చాకచక్యంగా చల్లూరు గ్రామానికి పిలిపించి ప్రజల సమక్షంలో దేహశుద్ధి చేస్తే ఈ సంఘటనపై తమపై పోలీసులు కిడ్నాప్ కేసు పెడతామని బెదిరించడం నీతిమాలిన విధానమని అన్నారు. అప్పుడే దోషులను చంపేస్తే ఏంచేసేవారని? వారు ప్రశ్నించారు. సిఐ, ఎస్‌ఐ అర్ధరాత్రి తమ బిడ్డను స్టేషన్‌కు పిలిపించుకుని అసభ్యపదజాలంతో విచారణ చేపట్టారని, మహి ళా పోలీసులతో విచారణ చేపడితే బాధపడేవారం కాదని వారు విలపించారు. మంత్రి ఈటెల రాజేందర్ పరామర్శించేందుకు వచ్చి పోయిం డు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని వారి ముందు విలపించారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఈ సంఘటనపై స్పందించకపోవడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యాచార ఘటనలో
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు
సస్పెండ్ చేస్తూ
ఎస్పీ జోయల్ డేవిస్ ఉత్తర్వులు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం రేపిన దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో ఎట్టకేలకు ఇద్దరు పోలీసులపై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్‌ఐ తెల్లబోయిన కిరణ్, పోలీసు కానిస్టేబుల్ పర్శరాములుగౌడ్‌ను జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అత్యాచార బాధితురాలు, అత్యాచార ఘటన నుంచి తప్పించుకున్న యువతిని ఎస్పీ స్వయంగా విచారించిన అనంతరం వీణవంక ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌పై ఎస్పీ వేటు వేశారు.