తెలంగాణ

చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 16మందిని కాల్చి చంపేశారు. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు సైతం ధ్రువీకరించాయ. బస్తర్ ఐజీ కల్లూరి, నారాయణ్‌పూర్ ఏఎస్పీ అభిషేక్ మీనాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే నారాయణ్‌పూర్ జిల్లా నేతనార్, ఆల్‌బేడా, పర్పా, కుందులా, మట్‌బేడా తదితర గ్రామాల నుంచి సుమారు 20మందిని మావోయిస్టులు మాట్లాడేందుకు అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో విచారించినట్లు తెలిసింది. అందులో కొందరిని ఇన్ఫార్మర్లుగా నిర్ధారించుకుని 16మందిని కాల్చిచంపినట్లుగా స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అబూజ్‌మాఢ్ ప్రాంతంలో తీవ్రకలకలం మొదలైంది. ఇటీవల ఆపరేషన్ గ్రీన్‌హంట్ 3వ దశలో భాగంగా అబూజ్‌మాఢ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు నిఘా వర్గాల సమాచారంతో చుట్టుముడుతున్నాయి. ఈక్రమంలోనే మావోయిస్టు కమాండర్ స్థాయి క్యాడర్ మొత్తం లొంగిపోతోంది. తమ క్యాడర్ మొత్తం చేజారిపోతోందన్న భావనలో మావోయిస్టులు గ్రామస్థులను ఇన్‌ఫార్మర్లుగా ముద్ర వేసి చంపడం దారుణమని బస్తర్ ఐజీ కల్లూరి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం తమ బలగాలను ఆయా గ్రామాలకు పంపించామని, రాగానే సమాచారం వెల్లడిస్తామని నారాయణ్‌పూర్ ఏఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. వరుస ఘటనలతో చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోననే ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పకాంజూర్ జిల్లాలో బంద్రే పోలీసుస్టేషన్ పరిధిలో కూడా త్రిల్‌గడ్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఇన్‌ఫార్మర్ అనే నెపంతో బుధవారం మావోయిస్టులు హత్య చేశారు.