తెలంగాణ

ప్రాజెక్టుల బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరంతో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఐదు ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులపై నిర్మించబోయే ఐదు బ్యారేజీల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ప్రాజెక్టుల నిర్మాణంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి రావాల్సిందిగా మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావును ఫోన్లో ఆహ్వానించారు. దీంతో ఈనెల 8న ముంబయికి వెళ్లడానికి కెసిఆర్ పర్యటన ఖరారైంది. ఇరు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చేలా మూడు నదులపై నిర్మించబోయే ప్రాజెక్టుల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగల నుంచి నీటిని సమర్థవంతంగా వాడుకుని రైతాంగానికి మేలు చేయాలని ఇద్దరు సిఎంల మధ్య జరిగిన సంభాషణల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మహారాష్ట్ర సిఎం ఆహ్వానం మేరకు నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఒక రోజు ముందుగానే 7న సాయంత్రం సిఎం కెసిఆర్ మంబయికి వెళ్లనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కుదురనున్న ఒప్పందం మేరకు పెన్‌గంగపై రాజాపేట వద్ద ఒక బ్యారే, చనాఖ-కొరాట మధ్య మరో బ్యారేజీ, పిన్ పహడ్ వద్ద ఇంకో బ్యారేజీ నిర్మించనున్నారు. అలాగే గోదావరిపై కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తారు. ఈ ఐదు బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఇరువురు సిఎంల సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకోనున్నారు. ఈ ఐదు ప్రాజెక్టులలో రాజాపేట, పిన్‌పహడ్ వద్ద నిర్మించబోయే ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా, మిగతా మూడు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించేలా ఒప్పంద పత్రాలు మార్చుకోవడానికి ఇప్పటికే అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీని నిర్మించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర భూభాగంలోనే అన్నారం, సుందిళ్ల మధ్య మరో రెండు బ్యారేజీలను నిర్మించడానికి తెలంగాణ ఇప్పటికే పాలనా పరమైన అనుమతులను పొందింది. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ప్రాజెక్టులు నిర్మించి అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రైతులకు సాగునీరు అందివ్వాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అయితే అంతరాష్ట్ర వివాదాల వల్ల వీటి నిర్మాణం ఇంతకాలంగా పెండింగ్‌లో పడింది. గత ప్రభుత్వ హాయంలో ప్రాణహిత- చెవేళ్ల ప్రాజెక్టు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్కోస్‌తో వీటికి పునర్ సర్వేతో పాటు లైడార్ సర్వే కూడా చేయించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేని విధంగా వచ్చిన సర్వే నివేదికలతో గత ఏడాది సిఎం కెసిఆర్ ముంబయి వెళ్లి మహారాష్ట్ర గవర్నర్, సిఎంతో సమావేశమై చర్చించారు. దీంతో మహారాష్ట్ర అధికారుల బృందం కాళేశ్వరం వద్ద నిర్మించబోయే స్థలాన్ని సందర్శించగా, మంత్రి హరీశ్‌రావు బృందం మహారాష్టల్రో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని సందర్శించి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను అధ్యయనం చేసిన తర్వాత వీటి నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర స్పష్టం చేసింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవడానికి సిఎం కెసిఆర్‌ను మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ ఆహ్వానించారు. దీంతో ఉత్తర తెలంగాణ రైతుల కల ఇంతకాలానికి సాకారం కాబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సాగునీటితో పాటు హైదరాబాద్‌కు మంచినీరు అందబోతుంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెరాస ప్రభుత్వ సంకల్పం కూడా నెరవేరబోతుంది.