తెలంగాణ

5న లాసెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ న్యాయ విద్యాకళాశాలల్లో యుజి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూలును కాకతీయ వర్శిటీ విడుదల చేసింది. లాసెట్ నోటిఫికేషన్ 5న వెలువడనుంది. దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 8 నుండి మొదలవుతుంది. సాధారణ అభ్యర్ధులు 350 రూపాయిలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 10లోగా సమర్పించాలి. 250 రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 21 వరకూ, 500 రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 30 వరకూ, వెయ్యి జరిమానాతో మే 7 వరకూ, 1500 జరిమానాతో మే 15వ తేదీ వరకూ అనుమతిస్తారు. మే 14 నుండి హాల్‌టిక్కెట్లను అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాసెట్ పరీక్ష మే 24న జరుగుతుంది. ప్రిలిమినరీ కీని మే 27న ఇస్తారు. 30 వరకూ అభ్యంతరాలను స్వీకరించి, జూన్ 10న తుది కీతో పాటు ర్యాంకులను ప్రకటిస్తారు.