తెలంగాణ

కెటిఆర్‌కు చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టెక్నాలజీ, పరిపాలన, పారదర్శకత అంశాల ఆధారంగా గత రెండేళ్లగా వినూత్నమైన పద్దతుల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, పురపాలక, ఐటి శాఖల మంత్రి కె.తారకరామారావుకు స్కోచ్ సంస్థ చాలెంజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించింది. ప్రముఖ దిగ్గజాలకి అందించే స్కోచ్ అవార్డును మంత్రి కెటిఆర్ అందుకోనున్నారు. అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కూడా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును స్కోచ్ సంస్థ ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఇరువురికి ఆహ్వానాలు అందాయి. టి హబ్ వంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి, టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చేందుకు చేస్తున్న కృషికి గాను కెటిఆర్‌కు ఈ అవార్డును ప్రకటించినట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా కేటగిరిలో ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపింది. టి హబ్ ఏర్పాటు ద్వారా స్టార్ట్‌ప్‌లకు చేయూత అందించడంలో మంత్రి ముందు వరుసలో ఉన్నారని అవార్డ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అవార్డుల ప్రదానోత్సవానికి రంగరాజన్, చిదంబరం, దీపక్ పరేఖ్, విజయ్ కేల్కర్ వంటి ప్రముఖులు హాజరువుతున్నట్లు స్కోచ్ సంస్థ తెలిపింది.
న్యూస్ కార్ప్ సమావేశానికి కెటిఆర్‌కి ఆహ్వానం
విక్రికేల్ ఇండియా సమ్మిట్ వార్షిక సమావేశానికి మంత్రి కె.టి.ఆర్‌ను ఆహ్వానించినట్లు ప్రఖ్యాత సంస్థ న్యూస్ కార్ప్ వెల్లడించింది. ఈ నెల 9, 10 తేదీల్లో ముంబయిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రముఖ ప్రసంగం చేయాలని న్యూస్ కార్ప్ సంస్థ కెటిఆర్‌ను కోరింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో అంతర్జాతీయంగా స్టార్ట్‌ప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులు పాల్గొంటారని తెలిపింది.