తెలంగాణ

నాకు పోలీస్ ఉద్యోగమే కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక: భవిష్యత్‌లో తనకు తాను రక్షించుకోవడానికి పోలీస్ శిక్షణ పొందిన తనకు పోలీస్ ఉద్యోగమే కావాలని, తన కుటుంబ పోషణకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాతో పాటు వ్యవసాయ భూమి, ఉండడానికో ఇల్లు కట్టించాలని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలు (23) డిమాండ్ చేసింది. కాంగ్రెస్ మాజీ మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి బుధవారం ఆమెను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, భవిష్యత్‌లో ఏమి చేయాలని కోరుకుంటున్నావని వారు ఆమెను ప్రశ్నించగా బాధితురాలు పైవిధంగా స్పందించింది. సంఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా కంటితుడుపు చర్యగా ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారని, డిఎస్పీ, సిఐలు విచక్షణారహితంగా, అసభ్య పదజాలంతో విచారించడంపై ఏమి చర్యలు తీసుకున్నారని బాధితురాలు కాంగ్రెస్ మహిళా నాయకులను ప్రశ్నించింది. ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని వాపోయింది. పరామర్శ అనంతరం విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ సంఘటనకు ముందు పోలీసులు స్పందిస్తే ఇంత దారుణం జరిగేది కాదని, గ్రామస్థులు దేహశుద్ధి చేసినా దోషులకు ఆసుపత్రిలో రాచమర్యాదలు చేయడంపై మండిపడ్డారు. జిల్లాలో ఇంత దారుణం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్ పరామర్శకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కూడా పరామర్శించలేదని అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన నిదర్శనమని, దోషులపై నిర్భయ చట్టంతో పాటు అట్రాసిటీ కేసు పెట్టడం కాదు, కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. న్యాయవాద సోదరులు దోషుల పట్ల వాదించకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
బాధితురాలిని పురుష పోలీసులతో విచారించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో షీ-టీములు ఉన్నాయా? ఉంటే ఆ పోలీసులు ఎక్కడున్నారని? విమర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉచిత రేషన్ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బాధిత కుటుంబం తరపున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.

ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, గందె మాధవి, ఆరెపల్లి మోహన్, గుగ్గిళ్ల జయశ్రీ, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.