రాష్ట్రీయం

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటికీ సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. అంతరాష్ట్ర వివాదాలు తలెత్తడంతో తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చొరవతో అంతరాష్ట్ర వివాదాలు ఒ కొలిక్కి వచ్చాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఐదు ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిందిగా హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాయగా, తాను స్వయంగా వెళ్లి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో కెల్లా అత్యంత కరువు పరిస్థితులు నెలకొన్న తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి పేర్కొన్నారు.