తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం సికిందరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న లోక్ సెంటర్ వద్ద చోటు చేసుకుంది. దుండగులు వేటాడి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా చంపడం సికిందరాబాద్‌లో కలకలం రేపింది. సికిందరాబాద్ పరిధిలోని పద్మారావునగర్ పార్సిగుట్ట ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జంగే సంజయ్ (24) అనే వ్యక్తి గచ్చిబౌలిలో సదార్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే సంజయ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగానికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున అయిదు గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని వస్తుండగా సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ముందు సంజయ్‌పై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతి కిరాతకంగా కత్తులతో కడుపులో పొడవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మహంకాళి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నార్త్‌జోన్ డిసిపి ప్రకాశ్‌రెడ్డి, అదనపు డిసిసి పి.వై.గిరి, మహంకాళి ఎసిపి తిరుపతి, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నార్త్‌జోన్ పోలీసులు రంగంలోకి దిగి సిసి కెమెరాలపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న బ్యాంక్ ఎటిఎం స్వప్నలోక్ కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలంలో క్లూ కోసం డాగ్‌స్క్వాడ్‌తో ప్రత్యేక క్రైం బృందం తనిఖీ చేపట్టారు. సంజయ్ తల్లిదండ్రులు సురేందర్, జయమ్మల ఫిర్యాదు మేరకు మహంకాళి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
పాత గొడవలే కారణమా?
సంజయ్ హత్యకు పాత గొడవలే కారణమా.. మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంజయ్ బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనుండి బయలుదేరి తన స్నేహితుడు కుశాల్‌తో కలిసి మాదాపూర్‌లో నివాసం ఉంటున్న మరో స్నేహితుడు సిద్ధాంత్ రూమ్‌కి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించి అనంతరం బుధవారం అర్ధరాత్రి సంజయ్‌ని అతని స్నేహితుడు కుశాల్ పంజగుట్ట సెంట్రల్ మాల్స్ వద్ద వదలి వెళ్లినట్లు, అక్కడి నుండి సంజయ్ ఫ్రెండ్స్ మరో ఇద్దరు పార్సిగుట్టకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్శిగుట్టకు చెందిన ప్రమోద్, భాస్కర్‌లు బేగంపేటలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగానే పనిచేస్తున్నారు. వారిని కలిసిన అనంతరం సంజయ్ హత్యకు గురయ్యాడు. పోలీసులు సంజయ్ చివరి మొబైల్ కాల్స్ జాబితా సేకరించి నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. సంజయ్ గతంలో క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని, లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు పోలీసులు విచారణలో వెల్లడయింది.

ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
దళిత యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 3: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఉప్పర రవి, యువజన కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి, పాడి కౌశిక్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను కలిసి ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన రోజే ఘటన నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు సమాచారం అందించినా, పోలీసులు సమయానికి స్పందించలేదని, బాధితురాలి బంధువులు నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి 15 రోజులు గడిచినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సమయానికి పోలీసులు స్పందించి ఉంటే దళిత యువతి అత్యాచారానికి గురై ఉండేది కాదని, చివరకు నిందితులను అరెస్ట్ చేసి మైనర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఘటనపై పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు స్పందించి బాధితురాలిని పరామర్శించినా పోలీసులు మాత్రం ఇప్పటివరకు బాధితురాలి వద్దకు రాలేదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలికి ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు వివరించారు.

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మకు
ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

ట్రాలీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

సీట్లతో సహా రోడ్డుపై పడిన ప్రయాణికులు 13మందికి తీవ్ర గాయాలు

గండేపల్లి, మార్చి 3: తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద గురువారం తెల్లవారుజామున లారీ ట్రాలీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా ధ్వంసమై, సీట్లు ఊడి వాటితోసహా ప్రయాణీకులు రోడ్డుపై పడిపోయారు. వీరిలో 13మందికి కాళ్లు విరిగిపోయాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న శ్రీ వెంకట కనకదుర్గ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మురారి గ్రామం వద్ద తమిళనాడు నుండి ఒడిస్సా వెళుతున్న ట్రాలీ లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా బస్సు ఎడమవైపు భాగం ట్రాలీని ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమయ్యింది. దీనితో 15 సీట్లు ఊడి రోడ్డుపై పడిపోయాయి. ఆయా సీట్లలో కూర్చున్న 13మంది ప్రయాణీకులు సైతం రోడ్డుపై పడిపోవడంతో వారందరికీ కాళ్లు విరిగిపోయాయి. బస్సు క్లీనర్ యర్రంశెట్టి ప్రసాద్, రెడ్డిబోయిన నారాయణరావు, అబ్దుల్ రఫీ, బదిరెడ్డి గాంధీ, రౌతు రవీజీ, కోగంటి రాజమనోహర్, సిన్నుల వెంకటేష్, హనుమకొండ ప్రసాద్, అనిశెట్టి కిషోర్, దొడ్ల నాగరాజు, పింజుమళ్ల శ్రీనివాస్, చందక అప్పన్న కాళ్లు విరిగిన వారిలో ఉన్నారు. అలాగే మోరంపూడి ప్రసాద్, చలమలశెట్టి సూర్యనారాయణ, బస్సు కుడివైపు కూర్చున్న మరో ఐదుగురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న జగ్గంపేట సిఐ జివివి సత్యనారాయణ, గండేపల్లి ఎస్సై రజనీకుమార్ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తం ఐదు అంబులెన్సుల్లో క్షతగాత్రులను తరలించారు. కాగా బస్సుకు విజయవాడలో కొత్త డ్రైవరును ఎక్కించారని గాయపడిన క్లీనర్ ప్రసాద్ తెలిపాడు.

మావోయిస్టుల మృతదేహాల
పోస్టుమార్టాన్ని చిత్రీకరించండి

అనంతరం బంధువులకు అప్పగించండి
పోలీసులను ఆదేశించిన హైకోర్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 3: చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించాలని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీచేసింది. ఈ నెల 1వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసులో పౌర హక్కుల సంఘం తరఫున న్యాయవాది వి రఘునాథ్ వాదిస్తూ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని కోరారు. కాగా జాతీయ మానవహక్కుల సంఘం జారీచేసిన మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు ఏజి జె రామచంద్రరావు తెలిపారు.