తెలంగాణ

దళిత బిడ్డను దాచిపెడతారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దళిత యువతిపై అత్యాచారం జరిగితే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడిని నేను పరామర్శకు వస్తే.. నా దళిత బిడ్డను దాచిపెడతారా! ఈ తతంగం ఎవరు చేయిస్తున్నారు? 5 గంటలు నిరీక్షించాలా? రాజకీయాలు చేస్తే చేసుకోండి? ప్రభుత్వం 48 గంటల్లో బాధితురాలికి న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అత్యాచార బాధిత కుటుంబాన్ని కృష్ణ మాదిగ ఆదివారం పరామర్శించారు. బాధితురాలిని ఎక్కడో దాచిపెట్టారని వదంతులతో 5 గంటలు బాధితురాలి కుటుంబం వద్ద ఉన్నారు. రాజకీయంగా కొందరు అధికార పార్టీకి, పోలీసులకు వత్తాసు పలుకుతున్నారని, నిరీక్షణ అనంతరం బాధితురాలిని పరామర్శించారు. బాధిత కుటుంబీకుల సూచన మేరకు అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద నిర్లక్ష్య వైఖరికి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానీ, విచారణ పేరుతో సిఐ తన వాహనంలో ఫిబ్రవరి 24 తేదీన సంఘటనా స్థలానికి అర్ధరాత్రి తీసుకెళ్లి ఎవరు ఎన్ని నిమిషాలు అత్యాచారం చేశారని బాధితురాలిపై కొట్టడానికి చెయ్యెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పురుష పోలీస్ అధికారి పని ఇదేనా! అంటూ సిఐని సస్పెండ్ చేయాలన్నారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లని డిఎస్పీ మీడియా ప్రకటన ఇవ్వడం, ఆ తరువాత మేజర్లని ఫోరెన్సిక్ ద్వారా బట్టబయలు కావడం ఇదంతా డిఎస్పీ వల్ల జరిగింది కాదా! అని ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన డిఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండవ పొజీషన్‌లో ఉన్న మంత్రి ఈటెల రాజేందర్ ఫిబ్రవరి 28న బాధితురాలిని పరామర్శించుటకు వచ్చి ఆదుకుంటానన్నారు. ఏమి ఆదుకున్నారో? ఎలా ఆదుకుంటారో? ఇప్పటివరకు తెలపలేదని విమర్శించారు. బాధితురాలి సూచన మేరకు ప్రభుత్వం తక్షణం పోలీస్ ఉద్యోగంగాని, ఇతర శాఖల్లో గాని నియమించాలని, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి, ఫ్రీ రేషన్ లాంటివి అత్యాచార బాధితులకు చట్టం ఉందని, తక్షణం అమలు చేయాలని, పూర్తి డిమాండ్లు 48 గంటల్లో అమలు చేయకుంటే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.రమేష్, మహిళా అధ్యక్షురాలు లత, జాతీయ నాయకులు రుద్రారపు రాంచంద్రం, ఇంజం వెంకటస్వామి, రేణికుంట సాగర్, గాజుల రామయ్య, బీడి వెంకటస్వామి, అంబాల మధునయ్య, బోయిని సమ్మయ్యలతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎక్స్‌ప్రెస్ హైవేలకు
రక్షణ శాఖ కొర్రీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం రెండు ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించాలని చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు, బాలానగర్ నరసాపూర్ రోడ్‌లను విపరీతంగా పెరిగిన భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్ హైవేలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను ఇప్పటికే సిద్ధం చేసి కేంద్ర రక్షణ శాఖకు పంపించింది. సికింద్రాబాద్, బాలానగర్ ప్రాంతాల నుంచి విపరీతంగా పారిశ్రామిక అవసరాలకు గాను భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు చాలా తక్కువ వేగంగా ఈ రెండుచోట్ల వెళ్లడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గమ్యస్ధానానికి వెళ్లేందుకు చాలా ఆలస్యం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గాను ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించాలని తెలంగాణ సర్కార్ సంకల్పించింది. అయితే షామీర్‌పేట మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం ఎక్కువగా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ప్రాంతం మీదుగా వెళుతున్నందున కొంత భూమి అవసరమైంది. ఈ భూమిని సమకూరిస్తే తాము ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రక్షణ శాఖ ఉన్నతాధికార వర్గాలకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ ద్వారా ప్రభుత్వం రక్షణ శాఖకు పంపించి కొన్ని నెలలు గడిచింది. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. షామీర్‌పేట వరకు ఎక్స్‌ప్రెస్ హైవేకు 26 హెక్టార్లు, నర్సాపూర్ రోడ్‌లో 16 హెక్టార్ల భూమి అవసరం ఉందని రక్షణ శాఖకు ప్రభుత్వం తన డిపిఆర్‌లో స్పష్టం చేసింది. తొలుత సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట మీదుగా వెళ్లే రాజీవ్ రహదారి రోడ్డును 30 నుంచి 40 అడుగుల మేర విస్తరించాలని ఆర్‌అండ్‌బి అధికారులు సిఎంకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సిఎం అధికారులతో సమగ్రంగా చర్చించిన అనంతరం రాజీవ్ రహదారితో పాటు నర్సాపూర్ రోడ్డును కూడా ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మించాలని తలపెట్టారు. దీంతో అధికారులు గత ఏడాది సెప్టెంబర్‌లో సిఎం కెసిఆర్‌కు సమగ్ర నివేదిక అందించారు. రాజీవ్ రహదారి ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.1500 కోట్లు, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని వారు ఆ నివేదికలో స్పష్టం చేశారు. అనంతరం రక్షణ శాఖకు భూమి కావాలని సిఎం లేఖ రాసినప్పటికీ ఇంతవరకు స్పందన కనిపించలేదు.

రక్షణ శాఖ అందించే భూమికి సరిపడా భూమిని ప్రత్యామ్నాయంగా మరో చోట రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చినా అవతలి వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనపై క్షేత్ర స్థాయిలో సందర్శించిన అనంతరం ఈ ప్రతిపాదనలపై కదలిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఎదురుకాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి

భద్రాచలం, మార్చి 6: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కూలీలు మరణించారు. నారాయణ్‌పూర్ జిల్లా ఆదాయ్‌ఘాట్ అడవిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణపనుల భద్రతకు పోలీసులు పహారా కాస్తున్నారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ తొలుత మందుపాతర పేల్చారు. ఇంతలో పోలీసులు తేరుకుని నక్సల్స్ దాడిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణపు పనుల్లో ఉన్న కూలీలకు తూటాలు తగిలి, ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. నక్సల్స్ అడవుల్లోకి పారిపోయారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా గాయపడ్డారు. నక్సల్స్ కోసం సమీప అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.