తెలంగాణ

మూసీకి మంచిరోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మూసీకి మంచి రోజులు రానున్నాయి. మూడు వేల కోట్ల రూపాయలతో దశలవారీగా పూర్వవైభవం తీసుకురానున్నారు. మూసీపై ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఈనెల 15న దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో సమావేశమై సుందరీకరణ, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. నాబార్డ్ సహాయంతో గ్రీన్ క్లైమెట్ ఫండ్ నిధుల ద్వారా దశలవారీగా మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు ఆదివారం మూసీని పరిశీలించారు. కెటిఆర్ బృందం ఆదివారం ఉప్పల్, ఉస్మానియా ఆస్పత్రి, అంబర్‌పేట మెట్రో లే ఔట్ ప్రాంతాలను సందర్శించారు. మూసీ నది హైదరాబాద్ నగర పరిధిలో 30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మూసీలోకి 51 నాలాలా ద్వారా నగరంలోని మురికి నీరు వచ్చి కలుస్తుంది. నగరానికి సంబంధించి మొత్తం 1250 ఎంఎల్‌డి మురికి నీటిలో 93శాతం మూసీలోనే కలుస్తోంది. సగం నీటిని మాత్రం సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసి వదులుతున్నారు. కొత్తగా పది సివరేజ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. త్వరలోనే మూసీనదిలోని కొన్ని ప్రాంతాలను సుందరీకరించనున్నట్టు చెప్పారు. తొలి విడత 1-2 కిలో మీటర్ల వరకు స్వచ్ఛమైన నీటితో కళకళలాడేట్టు చేస్తారు. హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి టూరిజం, ఇరిగేషన్ శాఖలు కలిసి పని చేస్తాయి. మూసీపై ఈస్ట్, వేస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపడతారు. సుందరీకరణకు మొడు వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం నాబార్డ్ సహాయంతో గ్రీన్ క్లైమెట్ ఫండ్ నిధులతో పాటు, దక్షిణ కోరియా నిధుల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఈనెల 15న దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలతో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చిస్తారు. అభివృద్ధి పనులపై పది రోజుల్లో నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. మూసీ ప్రాంతంలో దుర్వాసన, దోమల నివారణ కోసం సుగంధ భరిత మొక్కలు పెంచుతారు. మంచిరేవుల నుంచి బాఫూఘాట్ వరకు మంచి నీటితో ప్రవహించేలా మూసీని తిర్చిదిద్దనున్నారు. ఉప్పల్ బగాయత్ భూముల పక్కన మూసీని సుందరీకరించి హెచ్‌ఎండిఎ ద్వారా ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు. హెచ్‌ఎండిఏ ను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ప్రైవేటు నిర్మాణ సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దనున్నట్టు కెటిఆర్ తెలిపారు.
హుస్సేన్ సాగర్‌లోకి వచ్చి కలుస్తున్న కూకట్‌పల్లి నాలా మళ్లింపు నెల రోజుల్లో పూర్తవుతుందని కెటిఆర్ తెలిపారు. టిప్పుఖాన్ బ్రిడ్జి బాఫూఘాట్ ప్రాంతాల్లో మూసీ అభివృద్ధికి వీలున్న ప్రాంతాలను మ్యాపులతో సహా పరిశీలించారు. కెటిఆర్ అంతకు ముందు ఉప్పల్ బగాయత్ భూములు, అంబర్ పేట్ ఎస్‌టిపి పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూసీ అభివృద్ధి ప్రణాళికలను కెటిఆర్ పరిశీలించారు. గతంలో హైకోర్టు ముందు రబ్బర్ డ్యామ్ ఏర్టపు చేసి అందులో మురికి నీరు నింపారని, అది విఫలం అయిందని భవిష్యత్తులో అలా కాకుండా మంచినీళ్లు ప్రవహించేలా మూసీని అభివృద్ధి చేస్తామని కెటిఆర్ తెలిపారు. మూసీ సుందరీకరణ ఒకే కాదని, దశల వారిగా చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్ కోసం త్వరలోనే నాబార్డ్ చైర్మన్‌ను కలువనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఉప్పల్ బగావత్ లే ఔట్స్ పూర్తయ్యాయని ముఖ్యమంత్రి ఆదేశాలతో త్వరలోనే ఇక్కడి ప్లాట్లను హెచ్‌ఎండిఏ ద్వారా వేలం వేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజి గోపాల్, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... మూసీపరీవాహక ప్రాంతంలో పర్యటించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న కెటిఆర్