తెలంగాణ

కారును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం యానగుందిలోని మాత మాణికేశ్వరిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కర్ణాటకలోని చించోలి నుండి తొమ్మిది మంది మాణికేశ్వరిమాత దర్శనార్థం కెఎ36ఎం4512 అనే నెంబర్ గల వాహనంలో బయలుదేరి వచ్చారు. మరికొంతసేపట్లో మాణికేశ్వరి మాత దర్శనం అవుతుందన్న సంతోషంలో ఉన్న వారిని విధి కాటేసింది. చిట్లపల్లి గేటు దగ్గరకు చేరుకోగానే రావులపల్లి నుండి కొడంగల్ వస్తున్న ఎపి22టిబి5594 అనే నెంబర్ గల లారీ ఎదురుగా వస్తున్న ఈ కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎల్లలింగం (32), నర్సమ్మ (28) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మిగతా వారిని చికిత్స నిమిత్తం కొడంగల్‌కు తరలించారు. వారిలో నవీన్ కుమార్ (30), వైష్ణవి (7), రష్మి (3) కూడా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గాయాలపాలైన కన్యాకుమారి (30), అఖిలేష్ (3), అధర్వ (4)లను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నర్సమ్మ, కన్యాకుమారిల తండ్రి అన్నారావు వద్దని వారించినా వినలేదని మృతుల బంధువులు విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు చూపరులకు కంటతడి పెట్టించాయి. దైవ దర్శనం కోసమంటూ వెళ్లిన వారు దైవం దగరికే వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు.

చిత్రం... రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. చెల్లాచెదురుగా
పడిన మృతదేహాలు