తెలంగాణ

పథకాలకు ప్రజా దీవెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో తెరాసకు అఖండ విజయం చేకూర్చిన ఓటర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఫలితాలు ప్రజల దీవెనలని సిఎం కెసిఆర్ అభివర్ణించారు. ఎన్నికల సందర్భంగా వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరుపాళ్ళు నెరవేస్తామని ప్రకటించారు. ఖమ్మంలో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజును సిఎం అభినందించారు. అచ్చంపేట నగర పంచాయితీలో తెరాసకు అన్ని స్థానాలు కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ, పట్టణానికి అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇలాఉండగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడంపట్ల పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సిఎంని కలిసి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సిఎంని క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేసిన నేతలను సిఎం అభినందించారు.

చిత్రం... కార్పొరేషన్ ఎన్నికల విజయంపై సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ నేతలు