ఆంధ్రప్రదేశ్‌

కొత్త ఇసుక విధానం ప్రకటించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులకు రుసుము, పన్ను లేకుండా ఇసుక పంపిణీ చేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని చేపట్టామని గనుల మంత్రి పీతల సుజాత తెలిపారు. శాసనమండలిలో బుధవారం వైకాపా సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఈ విధానానికి సంబంధించి మార్గదర్శకాలు, విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై 2727 కేసులను నమోదు చేశామని మంత్రి తెలిపారు.
అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారినుండి 22.39 కోట్ల రూపాయలు అపరాధ రుసుము వసూలుచేశామని వివరించారు. కొబ్బరి చెట్లకు బీమా అమలు చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలను ఎంపిక చేశామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. టిడిపి సభ్యుడు ఎంవివిఎస్ మూర్తి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ, బీమా వర్తింప చేసేందుకు నియమావళి రూపొందించామని వివరించారు. రైతులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల (ఎన్‌జిఓ) సహకారం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
గర్భిణిలు, చంటిపిల్లల తల్లులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, ఇందుకోసం రోజూ ఒక్కొక్కరిపై ఏడు రూపాయలు వ్యయం చేస్తున్నామని మహిళా సంక్షేమ మంత్రి పీతల సుజాత తెలిపారు.
చెంగల్‌రాయుడు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఈ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు భరిస్తున్నాయన్నారు. పాతబడ్డ ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ఆలోచన ఏదీ ప్రభుత్వం చేయడం లేదని రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. రాష్ట్రంలో శిశు, ప్రసూతి మరణాల రేటును నియంత్రించేందుకు ఒక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని మహిళా సంక్షేమ మంత్రి సుజాత తెలిపారు. టి. రత్నాబాయి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ ప్రణాళిక సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను, ప్రయోగశాలలను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ప్రస్తుతం అన్ని తరహా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తున్నామన్నారు.
రోజూ 5వేల మందికి అన్న ప్రసాదం
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రోజూ ఐదువేల మంది భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. సభ్యుడు బుద్ద వెంకటేశ్వరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఏటా నాలుగు కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతున్నాయని వివరించారు.