తెలంగాణ

రోహిత్ చట్టాన్ని సాధిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల వేదనను వినే పరిస్థితిలో లేదని జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం కలగానే మిలిగిపోతోందని దానిని సాధించేందుకే పోరు సాగిస్తున్నామని అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కన్హయ్యకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. సిపిఐ నేత నారాయణ, మాజీ ఎంపి అజీజ్‌పాషా, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. కన్హయ్య కుమార్ రాకతో హెచ్‌సియులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో నేరుగా కొండాపూర్‌లోని సిఆర్ ఫౌండేషన్‌కు తరలించారు. ఎయిర్‌పోర్టులో దిగగానే కన్హయ్య కుమార్ మాట్లాడుతూ భగత్‌సింగ్ వర్ధంతి నేపథ్యంలో సామాజిక న్యాయంకోసం చేస్తున్న పోరులో భాగంగా హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. జైలునుంచి విడుదలైన తర్వాత సామాజిక పోరాటం దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకున్నానని, అందులో భాగంగా తాను తొలుత హైదరాబాద్ వచ్చానని చెప్పారు. సిఆర్ ఫౌండేషన్‌కు చేరుకున్న కన్నయ్య కుమార్ వేముల రోహిత్ తల్లి రాధికతో సమావేశం అయ్యారు. అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి బయలుదేరి ఆరుగంటలకు చేరుకున్నారు. తొలుత పోలీసులు కన్హయ్య కుమార్‌తోపాటు పదిమందిని క్యాంపస్‌లోకి అనుమతిస్తామని చెప్పారు. తీరా కారు రాగానే ఉన్నతాధికారుల సమాచారంకోసం ఎదురుచూస్తున్నామని, కాస్తా ఓరిమి పాటించాలని పోలీసులు చెప్పారు. కన్హయ్యకుమార్‌తో వచ్చిన సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కె. నారాయణ కారు దిగి పోలీసుల వద్దకు వచ్చి ఎందుకు ఆపారని నిలదీశారు. లోపలికి ఎవరినీ అనుమతించవద్దని విసి ఆదేశించారని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో నారాయణ పోలీసు ఉన్నతాధికారులతో వాగ్యుద్ధానికి దిగారు. ముందు అనుమతిస్తామని చెప్పి, తీరా ఇప్పుడు అనుమతించలేమని పేర్కొనడం సబబుకాదని అన్నారు. ఒకపక్క విద్యార్థులు, మీడియా, మరోపక్క వందలాది మంది పోలీసులు, సెంట్రల్ వర్శిటీ సెక్యూరిటీ సిబ్బందితో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కన్హయ్యకుమార్ కారు దిగి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. లాఠీలతో కొట్టినా, ఆస్పత్రిల్లో చేర్పించినా తమ గొంతును ఎవరూ నొక్కలేరని అన్నారు. సామాజిక న్యాయంకోసం తాము పోరాటం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కలలను సాకారం చేసేందుకు తమ పోరు సాగుతుందని చెప్పారు. రోహిత్ చట్టాన్ని తెచ్చేంతవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రోహిత్ తల్లిని, సోదరుడిని కలిసి మద్దతు పలికేందుకే తాను హైదరాబాద్ వచ్చానని అన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎంతకాలం వారు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. తాము సామాజిక ఆజాదీ కోరే దేశ భక్తులమని, తమ దేశభక్తిని ప్రశ్నించనక్కర్లేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ డ్రెస్‌లు వేసుకుంటే అదే దేశభక్తి కాదని పేర్కొన్నారు. తమను అడ్డుకున్న ప్రతిసారీ కెరటంలా లేచి వస్తామని చెప్పారు.
నేడు విజయవాడకు
కన్హయ్య కుమార్ గురువారం విజయవాడ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు.