తెలంగాణ

పరిగిలో పెళ్లి వ్యాను బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: రంగారెడ్డి జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బోల్తా కొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి కొందూర్ మండలం ఉత్తరాస్‌పల్లికి పెళ్లి బృందం డిసిఎం వ్యాన్‌లో 65 మందితో బయలు దేరింది. పరిగి పరిధిలోని చిన్న వాగు వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. సంఘటనలో నవీన్ (25), మానయ్య (55) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన దోమ మండలం అయినపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ (26), చేవేళ్ళ మండలం కుమ్మర గ్రామానికి చెందిన అనుసూయ (30) చికిత్స పొందుతూ మృతి చెందారు. ద్యాచారానికి చెందిన బోయిన బుచ్చయ్య (39), అంతారం బుచ్చయ్య, శరణ్య (15)లను అత్యవసర చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు, చికిత్సకు ముందే మరొకరు మృతి చెందారు. కాగా ఘటనలో మరో ఇద్దరు సంతోష్‌కుమార్, వెంకట్ రాములు పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాధవి (18), మల్లయ్య (70), లక్ష్మీ (35), అంజమ్మ (55), జ్యోతి (12), లక్ష్మీదేవిపల్లి, చిన్నయ్య (50), శారద (40), నర్సమ్మ (28), గట్టుపల్లి, హరీష్ (10), పద్మమ్మ (55), అనంతయ్య(40), సాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలమ్మ (60), శేఖర్ (25), రాజేందర్ (30), వెంకట్‌రాం (50), రావులపల్లి, అశోక్ (45), మొగిలిగుండ్ల, నరేష్ (10), సురేష్ (12), అక్కమ్మ (33), శివకుమార్ (12), మల్లయ్య (60), పద్మమ్మ (40), వెంకటయ్య (70), రామయ్య (58), వెంకటేష్ (30), ఐనాపూర్, రాజు (28), పద్మమ్మ (55), బుచ్చమ్మ (30)లు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బుధవారం చోటుచేసుకున్న దుర్ఘటనతో నస్కల్- వికారాబాద్ రోడ్డు రక్తసిక్తమైంది. ద్యాచారం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయంది. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోదనలు మిన్నంటాయ. తీవ్రంగా గాయపడిన వారిని పరిగిలోని సాధన ఆసుపత్రికి తరలిస్తే, మరికొందరిని నగరంలోని ఉస్మానియాకు తరలించారు. పెళ్ళి వ్యాను బోల్తాపడిన సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అంత్యక్రియల నిమిత్తం కలెక్టర్ ఆదేశాల మేరకు కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆర్డీఓ చంద్రమోహన్ ఆర్థిక సాయం అందించారు. పరిగి సమీపంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకుంటామని తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హఠాత్పరిణామం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి పి మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
ప్రమాద వివరాలు తెలుసుకున్న సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
విచారణ జరిపిస్తాం: ఎస్పీ రమారాజేశ్వరి
పరిగి సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని జిల్లా ఏస్పీ రమారాజేశ్వరి తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సామర్థ్యానికి మించి పెళ్లి బృందం ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. కేసును పరిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

చిత్రం... ప్రమాదానికి గురై ఏడుగురి ప్రాణాలు తీసిన డిసిఎం వ్యాను