తెలంగాణ

అభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణలో చేపట్టబోయే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యం కావడానికి చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైనా గెజౌభా గ్రూప్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ ముఖ్య ప్రతినిధి హుయాంగ్ వాన్లిన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్‌తో సమావేశమైంది. చైనాలో యాంక్సీ నదిపై కట్టిన భారీ బ్యారేజ్‌ల నిర్మాణంలో భాగస్వామ్యమైన తమకు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అపారమైన అనుభవం ఉందని వారు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు. ముఖ్యంగా గోదావరిపై నిర్మించ కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వివరించారు. వీటికి పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులను నిర్మించడానికి చైనా కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్రంలో నిర్మించబోయే రహదారులు, వంతెనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. ప్రాజెక్టులు వీలైనంత తొందరగా, అత్యంత నాణ్యతతో నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా వచ్చేదేశ, విదేశ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు విధి, విధానాల తయారీకి, నిర్మాణ సంబంధ విషయాలు మాట్లాడేందుకు మరోసారి పూర్తిస్థాయిలో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

చిత్రం... చైనా ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతున్న సిఎం కెసిఆర్