తెలంగాణ

అంబేద్కర్ అవతార పురుషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుప్రఖ్యాతులు మరింత పెరుగుతాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు అన్నారు. ‘్భరత రాజ్యాంగానికి 65 వసంతాలు’ అంశంపై శుక్రవారం భారతీయ విద్యా భవన్‌లో ఏర్పాటైన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్‌ను షెడ్యూల్డ్ కులాల వారే ఆరాధించాలన్న భావన పోవాలని, షెడ్యూల్డ్ కులాలు కానీ వారికీ ఆయన ఆరాధ్యుడేనని ఆయన అన్నారు. జాతి పునరుజ్జీవనం కోసం అంబేద్కర్ పోరాటం చేశారని, ధర్మం పట్ల ఆయనకు నమ్మకం ఉండేదని, అవతార పురుషుడని మురళీధర్ రావు కొనియాడారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మనసుకు ధర్మం అంతే ముఖ్యమన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం దేశం ఎలా ఉండాలనే విషయంపై అంబేద్కర్‌కు స్పష్టత ఉండేదని, అయినా కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని విమర్శించారు. వాల్మీకి, వ్యాసుడు లేని రామాయణ, భారతాలను ఎలా ఊహించుకోలేమో, అంబేద్కర్ లేని భారత దేశాన్ని కూడా ఊహించలేమన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు పోవాలన్న అన్నింటికీ విద్య ప్రధానమని అంబేద్కర్ చెప్పారని మురళీధర్ రావు తెలిపారు.
పశువధ మంచిది కాదని, లోగడ మెదక్ జిల్లా రుద్రారంలో సత్యాగ్రహం నిర్వహించేందుకు తాము బయలుదేరినప్పుడు అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారని మురళీధరరావుగుర్తుచేసుకున్నారు. అయితే తాను ఆ సమయంలో ఒక దళితునిలా మారు వేషంలో ఒక దళిత వ్యక్తి వెంట సమీప గ్రామానికి వెళ్ళానని ఆయన తెలిపారు. తాను రుద్రారం చేరుకోవడానికి ఇంకా గంట గడువు ఉండడంతో, ఆ గ్రామంలోని ఓ కరణం నివాసానికి ఇరువురం కలిసి వెళ్ళామని, తాను ఆ వ్యక్తి సోదరుని కుమారునిలా కరణానికి పరిచయం చేసుకున్నానని, గ్రామ పెద్ద ముందు దళితునిలా ప్రవర్తించేందుకు తాను ఎంతో యాతన పడ్డానని, పెద్ద కులాలవారి ముందు దళితులు ఎన్ని అవస్థలు పడతారో తనకు అప్పుడు అనుభవంలోకి వచ్చిందని మురళీధరరావు వివరించారు. బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు పి రాములు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ‘డిక్కీ’ సంస్ధ అధ్యక్షుడు నర్రా రవికుమార్, శ్యాం ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.