తెలంగాణ

జోగులాంబ ఆలయ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, నవంబర్ 27: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను నిరంజన్‌రెడ్డి సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయదలిచినట్లు దానికి నామకరణం జోగులాంబ మహిళా విశ్వవిద్యాలయమని నామకరణం చేసినట్లు, జిల్లాలో ఎక్కడైనా అనువైన స్థలంలో ఏర్పాటు చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివరించినట్లు అది పరిశీలనలో ఉందని, అమ్మవారి ఆశీర్వాదం వల్ల పూర్తవుతుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రశ్రేణిలో నిలపాలన్నది తన తలంపని, మహిళ విద్యను కూడ మరింత అభివృద్ధి చేసేవిధంగా కృషి చేస్తానని అన్నారు. ఎండోమెంట్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ప్రణాళికను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆమోదం తీసుకుంటామని ఈ పనులు చేసే శక్తిని తనకు ఇవ్వాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి