తెలంగాణ

నేతన్నకు నేనున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపూరు తరహాలో టెక్స్‌టైల్ పార్క్
సిరిసిల్లలో అపారెల్ పార్క్, రైల్వేలైన్
మార్కెటింగ్‌కు ఊతం
సబ్సిడీపై నూలు, రసాయనాలు
కార్మికులకు రూ.15-20 వేల ఆదాయకల్పన
మూతపడిన యూనిట్ల పునరుద్ధరణ
గద్వాల, పేట, పోచంపల్లికి పూర్వవైభవం
రానున్న బడ్జెట్లో నిధుల కేటాయంపు
ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలు
కార్మికులతో ముఖాముఖీ

హైదరాబాద్, ఫిబ్రవరి 19:తమిళనాడులోని తిర్పూరు తరహాలో వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న అపెరల్ పార్క్, పవర్‌లూమ్స్‌ను వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌తో అనుసంధానం చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌తోపాటు జిన్నింగ్, స్పిన్నింగ్ ప్రాసెసింగ్ యూనిట్లను, సిరిసిల్లకు రైల్వే లైన్‌ను ఏర్పాటు చేసి మార్కెటింగ్ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. నేత, చేనేత కార్మికులు, పవర్‌లూమ్ యజమానులతో ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. నేతన్నలకు ఉపాధి కల్పన, వారి సంక్షేమానికి తీసుకోబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థకు అనేకసార్లు దుఃఖపడ్డాను. అప్పట్లో ఒకే రోజు సిరిసిల్లలో 11 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. సమైక్య ప్రభుత్వంలో వారికి సహాయం అందే పరిస్థితి లేదు. అప్పుడు నేనే స్పందించి టిఆర్‌ఎస్ పక్షాన రూ. 50 లక్షలు సాయం చేశాను’ అని కెసిఆర్ గుర్తు చేశారు. ‘అలాగే పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించారు. వారికి సాయం అందించడానికి నేను స్వయంగా భిక్షాటన చేసి మరణించిన కార్మికుల కుటుంబాలకు నాలుగు లక్షలు పంపాను. ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాకూడదన్నది నా ఆకాంక్ష’ అని అన్నారు. నేత వృత్తిపై ఆధారపడే కార్మికులకు నెలకు రూ.15-20 వేల ఆదాయం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. పవర్‌లూమ్‌లకు రుణ సౌకర్యం కల్పించేందుకు ఈ ఏడాది రూ.100 కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రానున్న బడ్జెట్‌లో చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఒకప్పుడు చేనేత పరిశ్రమకు గొప్ప పేరుండేదని, ఇప్పటికీ గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలో నేసే పట్టు, ఇక్కత్ చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందని, పెళ్లి బట్టల కోసం గతంలో కంచి వెళ్లేవారు ప్రస్తుతం పోచంపల్లికి వెళ్తున్నారని చెప్పారు. నేత వృత్తిపై ఆధారపడిన కార్మికులను ఆదుకునేందుకు త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. మగ్గాలపై పనిచేసే కార్మికులకు ఆర్థిక తోడ్పాటు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేస్తామన్నారు. మార్కెటింగ్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలో తయారు చేసే వస్త్రాలను ప్రోత్సహించడానికి అవసరమై విధానం రూపొందిస్తామన్నారు. మరమగ్గాలు సిరిసిల్లలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి, వీటిని రేపియల్ మగ్గాల స్థాయికి తీసుకెళ్లి ఉత్పత్తి, నాణ్యత పెంచుతామన్నారు. పండుగల సందర్భంగా పేదలకు పంచే దుస్తులతోపాటు ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను ఇకనుంచి కార్మికుల నుంచే కొనుగోలు చేస్తామన్నారు. మర మగ్గం ద్వారా రోజుకు 40 మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుందని, అదే రేపియల్ మగ్గాల ద్వారా 150 మీటర్లు ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున తమకు అన్ని రకాల ప్రోత్సహం లభిస్తే ప్రతీ కార్మికునికి నెలకు రూ.15 వేలు బ్యాంక్‌లో వేస్తామని మగ్గాల యజమానులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, మంత్రులు కెటిఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, సిరిసిల్ల కలెక్టర్ భాస్కర్, మర మగ్గాల యజమానుల ప్రతినిధులు 40 మంది పాల్గొన్నారు.

చిత్రం... ఆదివారం ప్రగతి భవన్‌లో చేనేత కార్మికులు, పవర్‌లూమ్ యజమానులతో ముఖ్యమంత్రి కెసిఆర్