తెలంగాణ

చెంచుల కోసం అక్షయ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: అతి ప్రాచీన ఆదివాసి తెగ చెంచుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఆదిమానవులను గుర్తుకుతెచ్చేలా వీరి జీవన విధానం ఉంటుంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతానికి మాత్రమే చెంచులు పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో జాతి అంతరించిపోకుండా అధికారులు అక్షయపాత్ర పథకం అమలుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర పేరిట ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. హరేకృష్ణ సంస్థ చేపట్టిన అక్షయపాత్ర కార్యక్రమానికి పేదలనుంచి మంచి స్పందన రావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీతో కలిసి పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దాదాపు 20వేల మందికి ప్రతి రోజూ ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్నారు. ఈ పథకం స్ఫూర్తితో చెంచు జాతిని పరిరక్షించే విధంగా అధికారులు ఒక పథకానికి రూపకల్పన చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతానికే పరిమితమైన చెంచులు దాదాపు ఏడువేల మంది వరకూ ఉంటారు. వీరికి రోజూ అక్షయపాత్ర తరహాలో భోజనం అందించటం కోసం పథకానికి రూకపకల్పన చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే ఐటిడిఏ ద్వారా కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారని, ఏడువేల మందికి ప్రతి రోజు భోజనం సమకూర్చడం పెద్ద కష్టం కాదని అధికారులు చెబుతున్నారు.
దేశంలో సగటు ఆయు ప్రమాణం 65 ఉంటే, చెంచుల్లో 40 ఏళ్లే ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయిగా పరిగణిస్తున్నారు. ఆయు ప్రమాణాలు వేగంగా పడిపోవడానికి కారణాలపై నివేదిక సైతం రూపొందించారు. క్షయ, మలేరియా వంటి జబ్బులు, పౌష్టికాహారం ప్రధాన కారణమని తేలింది. ఇతర జబ్బుల పరిష్కారానికి ఏర్పాట్లు చేసిన అధికారులు, పౌష్టికాహారం కోసం అక్షయపాత్ర పథకం అమలుకు ఆలోచిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పదిమంది కన్నా తక్కువ నివసించే పెంటలు, 13నుంచి 25 మంది కన్నా తక్కువ నివసించే పెంటలు 26 ఉన్నట్టు తేలింది. వీరికి పౌష్టికాహారం అందించడం నిధుల సమస్య కాదని, అయితే పగడ్బందీగా అమలుచేసేలా త్వరలోనే పథకానికి రూపకల్పన చేయనున్నట్టు తెలిసింది.