తెలంగాణ

కందులు కరవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కంది పంటలపై కూడా పడింది. చలికాలంలో కురిసిన మంచుకు అడపదడప పడే వర్షానికి జిల్లాలో కందిపంట దిగుబడి కానుంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు పండించే కందులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరుకు తరలించి రైతులు విక్రయించే అనవాయితీ ఉంది. ఈ సారి కందుల దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పూతపూసి కాయదశకు రావాల్సిన కందిపంట పూత దశలోనే నెలరాలిపోయింది. జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో కందిపంటకు పూత రాలిపోయింది. దీంతో రైతాంగానికి తీవ్రనష్టం చోటు చేసుకుంది. దాదాపు ప్రతిరైతు ఎకరాకు 15 నుండి 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా క్వింటల్ కందులు కూడా దిగుబడి అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కొడంగల్, నారాయణపేట, హన్వాడ, దౌల్తాబాద్, మద్దూర్, ఊట్కూర్, మక్తల్, ధన్వాడ, కోయిలకోండ, కోస్గి, బోంరాస్‌పేట, భుత్పూర్, నవాబుపేట, అలంపూర్, గద్వాల మండలాల్లో సాగుచేసిన కందిపంట పూతపట్టి తుదకు నేలరాలిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్ల మేర రైతాంగానికి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని మండలాల్లో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. అయినప్పటికినీ వర్షాలు ఈ సీజన్‌లో కురవకపోవడం కందిపంటకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. పంట నష్టపరిహారంలో కందిపంట ఉందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికిని అందులో కందిపంట ఉందో లేదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూతదశలోనే నష్టం : వ్యవసాయ శాఖ జెడి
కంది పంట పూత దశలోనే రాలిపోయిందని దీంతో జిల్లాలో కంది పంట సాగుచేసిన రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ జెడి ఉష తెలిపారు. కందిపంట సాగుపై జెడి ఉషను సంప్రదించగా ఈ ఏడాది కందులు కరువేనని దాంతో కంది పప్పు ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు రెండు లక్షలకు పైగా ఎకరాల్లో కంది పంటను సాగుచేశారని తెలిపారు. 90శాతంకుపైగా నష్టం జరిగిందని ఇందుకు ప్రధాన కారణం వర్షాలు లేక వాతావరణంలో ఏర్పడ్డ మార్పు వల్ల కంది చేనుకు వచ్చిన పూత ఎన్ని మందులు పిచికారి చేసినా రాలిపోతోందని, కందిచేను ఎండిపోతోందని తెలిపారు. జిల్లాలో కందిపంట నష్టం రూ.250కోట్లకుపైగానే ఉండొచ్చని తెలిపారు.

హన్వాడ గ్రామంలో ఎండిపోయిన కంది చేను