రాష్ట్రీయం

వలసలపై ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమంతోపాటు రెండంకెల వృద్ధి లక్ష్యంగా పరుగులు తీస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ శాఖకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంటుంది. ఇప్పటికే ఈ సంస్థ అమరావతిలోని సిఆర్‌డిఏ గ్రామాల్లో భూములతోపాటు ఉపాధి కోల్పోయిన ఉత్సాహవంతులైన రైతులు, ఇతర కూలీలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. ఈ సంస్థ సీమాంధ్ర వాసులపై దృష్టి సారించి తొలిసారిగా హైదరాబాద్‌లో సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, కార్మికశాఖలో వలసల నిర్వహణా విభాగం, దేశాంతర వలసల్లో స్ర్తిశక్తి సంఘటన అంశాల్లో శిక్షణ ఉంటుందని ఈ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రధానంగా వలసల నియంత్రణా యంత్రాంగాన్ని రూపొందించుకోవటం, సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సాక్ష్యాలు ఉండేట్లు చూసుకోవటం, విధాన రూపకల్పన, వీటిలో ఎవరి జోక్యం ఎప్పుడు ఉండాలి అనేది స్పష్టత... అనే అంశాలు ఉంటాయి.
అసంఘటిత రంగంలో విదేశాల్లో సేవలందించడానికి వలసలు వెళ్లేవారికి సంబంధించిన నియమ నిబంధనల విషయంలో భారతదేశంలో ఇప్పటివరకు ఒక సమగ్రమైన విధానమంటూ లేదు. దీనివలన వలస వెళ్లిన మహిళలు అనేక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు పరిష్కారాలు, వీరిని విదేశాలకు పంపే బ్రోకర్ల దయాదాక్షిణ్యాలకు వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేంద్రప్రభుత్వ శాఖలకు వలస వెళ్లిన కార్మికులకు ఉభయులకు ఇబ్బందికరంగానే మారుతోంది. చివరకు విదేశీ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకుని అవతల దేశాల రాయబార కార్యాలయాలతో మాట్లాడి సమస్యలను చక్కబెట్టాల్సి వస్తోంది. వీటికి కూడా ఒక విధానమంటూ లేకుండా ఒక్కొక్క కేసు ఒక్కో పద్ధతిలో అన్నట్లుగా పరిష్కరిస్తున్నారు. దీంతో భారతదేశం నుంచి విదేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కొంత కాలంగా సార్క్ దేశాల సమావేశాల్లో చర్చించడానికి ఈ అంశాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా భారతప్రభుత్వం ఉంచడం జరుగుతూ ఉంది. రాష్ట్రం నుంచి ప్రధానంగా తూర్పు, పశ్చిమగోదావరి, కడప జిల్లాల నుంచి వలసలు జరుగుతుండటంతో తొలిసారిగా జరిగే మూడు రోజుల శిక్షణకు ఈ జిల్లాలకు చెందిన వారిని ఆహ్వానించి వారిని మాస్టర్స్ ట్రైనర్స్‌గా శిక్షణ ఇవ్వబోతున్నారు.