తెలంగాణ

పోటీ పరీక్షల శిక్షణకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ కోసం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన లెవెల్-1 పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి టి.విష్ణువర్థన్ తెలిపారు.
తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా 8 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన లెవెల్ -1 ఆబ్జెక్టివ్ పరీక్షకు దాదాపు ఆరు వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన మొదటి 1200 మంది అభ్యర్థులకు లెవెల్-2 వ్యాసరూప పరీక్షను వచ్చే ఆదివారం గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. లెవెల్-1 ఉత్తీర్ణులైన వారికి వారి వారి మొబైల్ నెంబర్లకు మార్కుల వివరాలను పంపించడం జరుగతుందని, అభ్యర్థులు ఎవరైనా కావాలనుకుంటే ఎన్టీఆర్ ట్రస్టు వెబ్‌సైట్ ద్వారా కూడా మార్కులు పొందవచ్చని ఆయన తెలిపారు.

సింధును అభినందించిన వైఎస్ జగన్

హైదరాబాద్, నవంబర్ 29: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటిన్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన తెలుగుతేజం పివి సింధును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందించారు. ఆదివారం జరిగిన మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు జపాన్‌కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని ఓడించి విజేతగా నిలిచారని అన్నారు. మకావు ఓపెన్‌లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి నిలవడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.