తెలంగాణ

బిజెపిలో ‘బీఫ్’ ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: బిజెపి తెలంగాణ శాఖలో ఇంత కాలం అంతర్గతంగా ఉన్న పోరు బీఫ్ ఫెస్టివల్‌తో బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి, పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కోల్డ్‌వార్ కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి అనర్హుడని రాజాసింగ్ మంగళవారం చేసిన సంచలమైన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అంతేకాదు కిషన్‌రెడ్డి అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆయన తేల్చి చెప్పారు. ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. రాజా వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కిషన్‌రెడ్డి నిరాకరించినప్పటికీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావుతీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన రాజా తీరును క్రమశిక్షణా సంఘానికి నివేదిస్తున్నామని, దాని నిర్ణయం ప్రకారమే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివాదానికి కారణమేమిటి?
కిషన్‌రెడ్డికి, రాజా సింగ్‌కు మధ్య వివాదానికి బీఫ్ ఫెస్టివల్ ఒక సాకుగానే కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు గోషామహాల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రాజాసింగ్ ఆసక్తి కనబరిచారని, అందుకు కిషన్‌రెడ్డి అడ్డుపడ్డట్లు పార్టీ వర్గాల కథనం. కానీ రాజా సింగ్ కొంత మంది పెద్ద వాళ్ళ ఆశీర్వాదంతో టిక్కెట్టు సంపాదించుకున్నారు. అప్పటి నుంచే ఇరువురి మధ్య వివాదం కొనసాగుతూనే వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ మజ్లీస్‌పై విమర్శలు చేయించడం తప్ప ఇతర అంశాలపై మాట్లాడేందుకు రాజాసింగ్‌కు అవకాశం ఇచ్చేవారు కాదన్న విమర్శలు ఆయన వర్గీయుల నుంచి ఉన్నాయి.
ఈ నెల 10న ఉస్మానియా వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌పై మీడియా అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి స్పందిస్తూ ఎవరి ఇష్టం వారిదని దాట వేశారు. కానీ దీనిని రాజా సింగ్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బీఫ్ ఫెస్టివల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరాల్సిందేనని అన్నారు. ఎవరి ఇష్టం వారిదని కిషన్‌రెడ్డి ఎలా అంటారంటూ మంగళవారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. బీఫ్ ఫెస్టివల్‌ను జరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. ఒకవేళ జరిగితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి ఘటన తరహాలో హైదరాబాద్‌లో పునరావృత్తం అవుతుందని హెచ్చరించారు. కిషన్‌ను తప్పించక పోతే పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పార్టీ సమావేశాలకు హాజ