తెలంగాణ

జిల్లాలకు వస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతోన్న తీరును స్వయంగా పరిశీలించి, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే జిల్లాల్లో పర్యటించబోతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వీలైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లానుంచే తన పర్యటన ప్రారంభిస్తానన్నారు. ఒక్కో జిల్లాలో కనీసం వారంపాటు పర్యటించి నీటిపారుదల ప్రాజెక్టులు, మంచినీటి సరఫరా, రహదారులు, వంతెనలు తదితర పనులను స్వయంగా పరిశీలించి నియోజకవర్గాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎల్ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, విఠల్‌రెడ్డి, చిన్నయ్య తదితరులను రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇక వాటిని వేగంగా అమలు చేయడమే మిగిలి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెరాస ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వరంగల్ ఎన్నికల్లో ఆ విషయం మరోసారి స్పష్టమైందని సిఎం అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పని చేయాలని, ప్రజా ప్రతినిధులు ప్రజావసరాలకు తగ్గట్టుగా స్పందించాలని సిఎం పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రహదారులు, వంతెనలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, వైద్య సదుపాయాల మెరుగుదలపై ఎక్కువ దృష్టి సారించాలని మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రహదారులు, వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి ఆయా ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ మంత్రి కెటిఆర్‌ను సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలు వెంటనే పూర్తి చేయాల్సిందిగా మరో మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం నత్తనడకన కొనసాగుతున్నాయని, వాటిని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించగా, రెండు, మూడు రోజుల్లోనే ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లడానికి ప్రజలు నదులు, కాలువలు దాటడానికి పడవలు ఉపయోగిస్తున్నారని సిఎం అన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి డబుల్ రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇలాఉండగా ఆదిలాబాద్ జిల్లా జోడె ఘాట్‌లో కొమురం భీమ్ వారసులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సిఎంను కోరారు. ప్రస్తుతం కొమురం భీమ్ వారసులకు చెందిన కుటుంబాలు 15 ఉన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని కోరగా, సిఎం సానుకూలంగా స్పందించారు.

చిత్రం... ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమావేశమైన సిఎం కెసిఆర్