తెలంగాణ

పాత కాపులకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: పొత్తుల ఊహాగానాలను పటాపంచలు చేస్తూ శాసన మండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మొత్తం పనె్నండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదివారం ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా, మంగళవారం ఐదుగురి పేర్లు అధికారికంగా ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలుండగా, జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రంగారెడ్డిలో రెండు స్థానాలకు శంభీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వరంగల్ నుంచి కొండా మురళి అభ్యర్థిత్వం ఖరారైంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకొని కొండా అభ్యర్థిత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మంత్రిగా మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి భార్య ఉండగా, ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ విషయంలో చివరి నిమిషం వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే జిల్లాలో పట్టు సాధించాలంటే మహేందర్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించడం, టిడిపి హయాంలోనూ వారి కుటుంబం చేతిలో ఇవే పదవులు ఉండటంతో చివరకు నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను మంగళవారం తెలంగాణ భవన్‌లో రాజ్యసభ సభ్యులు కె కేశవరావు విడుదల చేశారు.
పాత కొత్తల కలయిక
అభ్యర్థుల్లో కొత్త వారు, మొదటి నుంచి ఉన్నవారూ ఉన్నారని డి శ్రీనివాస్ తెలిపారు. 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మొత్తం పనె్నండు స్థానాలు గెలుస్తామన్నారు. వరంగల్‌లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీ వచ్చిందని, మండలి ఎన్నికల్లోనూ అదేవిధంగా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. టిడిపి, కాంగ్రెస్‌లు అవగాహనకు వచ్చినా తెరాస అభ్యర్థులే గెలుస్తారన్నారు. వరంగల్ ఫలితాలు పునరావృతం అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం నుంచి 15 మంది ఎంపిటీసిలు టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి కె కేశవరావు, డి శ్రీనివాస్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. మండలి ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల్లోనూ వివిధ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్పించారు.
నేడే చివరి రోజు
నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు. దాంతో మంగళవారం రోజే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ నుంచి టిడిపి అభ్యర్థిగా లక్ష్మీపురం నారాయణరెడ్డి, కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు, కాంగ్రెస్ నుంచి తిరుపతిరావు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ నుంచి టిడిపి అభ్యర్థిగా కొత్తకోట దయాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ తరఫున ఎస్ జగదీశ్వర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున లింగాల కమల్ రాజు నామినేషన్ దాఖలు చేశారు.