తెలంగాణ

పథకాల్లో కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: అంతగా ప్రాధాన్యతలేని పథకాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ కేటగిరిగా విభజిస్తారు. 2016-17 బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం సచివాలయంలో స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలతో సమావేశం అయ్యారు. సిఎస్ రాజీవ్ శర్మ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ల నేతృత్వంలో జరిగిన సమావేశంలో బడ్జెట్‌పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు కొన్నింటిలో కేంద్రం వాటా 90 శాతం కొన్నింటిలో 75 శాతం ఉండేదని, కానీ కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడిందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల 2015-16, 2016-17 రాష్ట్ర బడ్జెట్‌పై అదనపు భారం పడుతోందని అన్నారు. ఈ నెపథ్యంలో ఆయా పథకాల అమలు తీరు తెన్నులను సమీక్షించుకోవాలని అన్నారు. వేతనేతర, ప్రణాళికేతర వ్యయాల నియంత్రణపై కార్యదర్శులు దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను సమీక్షించుకొని ఎబిసి కేటగిరిలుగా విభజిస్తారు. ప్రాముఖ్యత లేని రాష్ట్ర పథకాలను, కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేయాలని కార్యదర్శులకు ఆర్థిక మంత్రి సూచించారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తక్షణం ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. దీని వల్ల అద్దె భారం తగ్గుతుందని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు చెప్పారు. మధ్యాహ్నా భోజనం, ఐసిడిఎస్, విద్య, స్వయం సహాయక బృందాలు, వైద్యం మొదలైన పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలని, అమలు తీరుపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు తాగునీటి పథకం, గృహ నిర్మాణం, నీటిపారుదల, సన్నబియ్యం, ఆసరా పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. ఈ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పారు. చిరుద్యోగులైన ఆశా వర్కర్లు, అంగన్‌వాడి వర్కర్లు, మధ్యాహ్నా భోజన పథకంలో పని చేసే ఉద్యోగులు, హెల్త్ వర్కర్లకు సంబంధించిన వేతనాలు, జీతాలు ప్రతి నెల అందే విధంగా ఆర్థిక శాఖ బాధ్యత వహించాలని మంత్రి కోరారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని శాఖలకు సంబంధించి కేంద్ర వాటాను తేల్చలేదని తెలిపారు. విద్యారంగం, మహిళా శిశు సంక్షేమం శాఖలకు సంబంధించి కేంద్రం వాటా నిర్ణయించలేదని తెలిపారు. దీని వల్ల ఆయా రంగాల్లో అనిశ్చిత వాతావరణం ఏర్పడుంతుందని అన్నారు. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో నిధుల కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఈటర రాజేందర్ తెలిపారు.

చిత్రం... ఉన్నతాధికారులతో సమావేశమైన ఈటల