తెలంగాణ

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: చట్టాలకు విరుద్ధంగా సిఎం కెసిఆర్‌తో పాటు ఆయన తనయుడు కెటిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం టిడిపి, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్య ర్థి అయిన మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కెటిఆర్ తన క్యాంపు కార్యాలయం అయిన సెక్రెటేరియట్‌లో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు కండువాలు కప్పుతుం టే పట్టించుకోని పోలీసులు, అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులపైనే అన్ని నిబంధనలు రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి దయాకర్‌రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఖ్య బలం లేకున్నప్పటికీ అధికారంలో ఉన్నామని ఎన్ని ప్రలోభాలు చేసైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువాలని తెరాస వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొ డతామని రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమష్టి నిర్ణయంతోనే టిడిపి, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని తెలిపారు. జిల్లాలో తెరాసకు ఉన్న సీట్లు ఎన్ని అని డబ్బుతో ఎన్నికలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ విలువల గురించి కెసిఆర్ మాట్లాడారని, ఉపన్యాససాలకే ఆయన ప్రసంగాలు పరిమితం అవుతున్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి దయాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టూటౌన్ సిఐ సోంనారాయణసింగ్ కల్పించుకుని ఇక్కడ ప్రెస్‌మీట్ పెట్టొద్దని ఎన్నికల కోడ్ ఉన్నందున కలెక్టరేట్ నుండి బయటకు వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూనే ఉండగా సిఐ వివిధ ఎలక్ట్రానిక్ మీడి యా లోగోలను తీసివేసి కవరేజ్ చేయొద్దంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారవుతారని అన్నారు. ఇంతలోపే ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు అక్కడి నుండి వెళ్లిపోయారు.