తెలంగాణ

ఎమ్మెల్సీ కోలాహలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా నువ్వా-నేనా అన్నట్లు పోటీ జరుగుతుంది. కానీ స్థానిక సంస్ధల కోటా నుంచి 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో చేతులెత్తేసింది. బిజెపి బరిలోనే లేదు. తెలుగు దేశం పార్టీ 5 స్థానాలకు పోటీ చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని స్థానాలకూ అభ్యర్థులను పోటీకి దించింది. నామినేషన్ల దాఖలుకు బుధవారం గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు 12 వరకు గడువు. 27న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఓటర్లు కాబట్టి, ఆయా జిల్లాల్లో పార్టీలు తమకు ఉన్న ప్రజాప్రతినిధుల బలాన్ని బేరీజు వేసుకుని రంగంలోకి దిగాయి. దీనిప్రకారం నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్- టిఆర్‌ఎస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది.
నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తేరా చిన్నపరెడ్డి పోటీకి దిగారు. తెలుగు దేశం పార్టీ నుంచి శ్రీనివాసరావు, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా మల్లేష్‌గౌడ్, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, దారా సింగ్, టిడిపి అభ్యర్థిగా బుక్కా వేణుగోపాల్, ఎంపిటిసీల ఫోరం అభ్యర్థిగా కె. అశోక్‌గౌడ్ బరిలో నిలిచారు. మెదక్ జిల్లాలో ఒక స్థానం ఉంది. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా వి. భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా శివరాజ్‌పాటిల్, టిడిపి అభ్యర్థిగా కొన్యాల బాల్‌రెడ్డి పోటీకి దిగారు.
వరంగల్ జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికలో తెరాస అభ్యర్థిగా కొండా మురళి, టిడిపి అభ్యర్థిగా ఎ. నరేందర్ రెడ్డి, ఇండిపెండెంట్లుగా మోడెం మల్లేష్, కె. లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ జిల్లా స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధుల్లో కాంగ్రెస్‌కు బలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్. భూపతిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కె. వెంకట రమణారెడ్డి, ఎంపిటీసీల ఫోరం అభ్యర్థిగా బి. జగదీష్ పోటీకి దిగారు. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద రావు, ఇండిపెండెంట్లుగా మునిపాక తిరుపతిరావు, ముద్దసాని రంగయ్య, ముత్యాల ప్రియారెడ్డి, ఎస్. ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిలగా బాలసాని లక్ష్మీనారాయణ, సిపిఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వర రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లింగాల కమల్‌రాజ్, ఇండిపెండెంట్లుగా జి. లక్ష్మీనారాయణ, కె. లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ఇక్కడ సిపిఐ అభ్యర్థి పువ్వాడకు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఆదిలాబాద్ జిల్లానుంచి ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పురాణం సతీష్‌కుమార్, టిడిపి అభ్యర్థిగా ఐ. నారాయణ రెడ్డి, ఎంపిటీసిల ఫోరం తరఫున రియాజుద్దీన్ పోటీకి దిగారు. మహబూబ్‌నగర్ జిల్లానుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎస్. జగదీశ్వర్ రెడ్డి, కె. నారాయణ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కె. దామోదర్ రెడ్డి, టిడిపి అభ్యర్థిగా కొత్తకోట దయాకర్ రెడ్డి, ఇండిపెండెంట్లుగా బోళ్ళ కరుణాకర్, కె. శ్రీనివాసా చారి, జగదీశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.