తెలంగాణ

రండి.. ఢిల్లీకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: స్థానిక సంస్ధల కోటానుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాపాడుకోలేకపోయారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీకి ఆదివారం అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో సోమవారం ఉదయం వీరు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. తొలుత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంతనాలు జరుపుతారు. స్థానిక సంస్థల కోటానుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీ ఫిరాయించడానికి గల కారణాలు, నిలుపుదల చేయలేక పోవడంలో వైఫల్యాలపై అధిష్టానం ఈ నేతలను నిలదీసే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థులు ఫిరాయిస్తుంటే నిలుపుదల ఆపలేకపోవడానికి గల కారణాలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాఉండగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఇచ్చిన సంజాయిషీ పార్టీ అధిష్టానాన్ని అసంతృప్తికి గురిచేసిన సంగతి తెలిసిందే. రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికలపైనా అధిష్టానం రాష్ట్ర నేతలతో ప్రణాళిక, వ్యూహంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.