తెలంగాణ

భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తుందని, రద్దు బదిలీ పథకం, సాదాబైనామాలపై పట్టా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ భవన్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో పలు ప్రాంతాల్లో పట్టా రికార్డుల్లో ఒకరు, పొజిషన్‌లో మరొకరు ఉండడం వల్ల భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. భూవివాదాలతో శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పట్టారికార్డులు, పొజీషన్ రికార్డుల్లో సైతం తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు, రైల్వేలైన్, ఇతర ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున ప్రభుత్వం భూసేకరణ చేస్తుందన్నారు. అనేక ప్రాంతాల్లో రికార్డుల్లో ఒకరు, పొజిషన్‌లో మరొకరు, పట్టా, పొజిషన్‌లో భూమికి వ్యత్యాసం ఉండడంవల్ల భూ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు అనేక సమస్యలు ఉత్పన్నమైతున్నాయన్నారు. గతంలో చాలా ప్రాంతాల్లో సాదాబైనామాల మీదే భూమి కొనుగోలు జరిగేదని, వాటిని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల భూసమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
సిఎం కెసిఆర్ భూమి కొనుగోలు చేసేవారికి అన్యాయం జరుగకుండా ఉండేందుకే సాదా బైనామాల పై కొనుగోలు చేసేవారికి కూడా పట్టారూపొందిస్తున్నట్లు చట్టం తెస్తున్నామన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా ఎంతోమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతులకు సాగుభూమి ఒకే దగ్గర ఉండేవిధంగా ప్రభుత్వం రద్దు బదిలీ పథకాన్ని తీసుకొస్తుందన్నారు. చాలామంది రైతులకు ఇక్కడ కొంత, అక్కడ కొంత భూమి ఉండడం వల్ల సాగు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురైతున్నాయన్నారు. రైతుల పరస్పర అంగీకారం వల్ల రద్దుబదిలీ పథకాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఏలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండానే సాదాబైనామాను పట్టాగా, రద్దుబదిలీ పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందన్నారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని కమతాలు ఏకీకరణ చేసుకోవాలన్నారు.