రాష్ట్రీయం

ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగా ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు వచ్చిన అభియాగాల్లో వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ హైక్టోరుకు తెలియజేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల జాబితా నుంచి 6.39 లక్షల మంది ఓటర్లను తొలగించడంతో బిసిలకు రిజర్వేషన్లను ఏవిధంగా ఖరారు చేస్తారని టిడిపి నాయకుడు ఫిరోజ్‌ఖాన్, కాంగ్రెస్ నాయకుడు నగేశ్ ముదిరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు వివరణ కోరింది. దీనిపై శుక్రవారం హైకోర్టుకు ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. జాబితాలో 7.9 లక్షల మంది ఓటర్లకు రెండేసి చోట్ల ఓటు ఉన్నట్టు జిహెచ్‌ఎంసి గుర్తించిందని, వాటిని మాత్రమే తొలగించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించిందని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. ఓటర్ల తొలగింపు ఉద్దేశపూర్వకంగా కానీ, సామూహికంగా కానీ జరుగలేదని, వ్యక్తిగత ఓటర్లుగానే జిహెచ్‌ఎంసి గుర్తించినట్టు ఎన్నికల కమిషన్ వివరించింది. రెండేసి చోట్ల పేరున్న ఓటర్లను జాబితా నుంచి ఇప్పుడే ఏమి తొలగించడం లేదని, జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఆ ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు హామీ తెలియజేసింది.