రాష్ట్రీయం

గన్నవరంలో ప్రణబ్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 25: పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించే నిమిత్తం శుక్రవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది. పర్యటన అనంతరం గన్నవరం చేరుకుని తిరుపతికి బయల్దేరి వెళ్లేముందు ఆయనకు ఘనంగా వీడ్కోలు లభించింది. హైదరాబాద్ నుంచి భారతీయ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నరకు గన్నవరంకు చేరుకున్నారు. రాష్టప్రతితో పాటుగా రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కూడా వున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపిలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, పలువురు శాసనసభ్యులు, తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం రాష్టప్రతితో పాటు గవర్నరు, ముఖ్యమంత్రి కలిసి వాయుసేనకు చెందిన హెలికాప్టర్లలో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 1-15ని.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వెనువెంటనే రాష్టప్రతి, గవర్నరు, ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు రాష్టప్రతికి ఘనంగా వీడ్కోలు పలికారు.

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ముక్కోటిని మించి
పోటెత్తిన భక్తులు

భద్రాచలం, డిసెంబర్ 25: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముక్కోటి ఏకాదశిని మించి శుక్రవారం భక్తులతో పోటెత్తింది. క్రిస్మస్ సెలవులు కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి భక్తులు భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 150 నిత్య కల్యాణాలు జరిగాయి. క్యూలైన్లలోని భక్తుల కోసం ఉచితంగా మంచినీరు ఏర్పాటు చేశారు. ఈవో జ్యోతి, ఏఈవో శ్రావణ్‌కుమార్, సిబ్బంది మొత్తం ఆలయంలోనే క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలా ఉండగా భద్రాచలం సందర్శనకు వచ్చిన భక్తులు పాపికొండల విహారయాత్రకు సైతం తరలివెళ్లారు. పాపికొండల యాత్ర బుకింగ్ రెండురోజుల క్రితమే పూర్తయింది. వరుసగా నాలుగు రోజుల పాటు లాంచీల్లో టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ జరపడం విశేషం. శని, ఆదివారాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాద్రిలో సీతారాముల నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తులు

ముగిసిన అతిరుద్ర
మహాయజ్ఞం

రామచంద్రపురం, డిసెంబర్ 25: తూర్పు గోదావరి జిల్లా దాక్షారామలో గత ఆరు రోజులుగా నిర్వహించిన అతిరుద్ర మహాయజ్ఞం శుక్రవారం ముగిసింది. శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగిసింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెంచలకోన (పెనుశిల క్షేత్రం) శ్రీమణిద్వీప మహాసంస్థానం భగవతి శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ నేతృత్వంలో, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సహకారంతో ఈ మహాక్రతువు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గురువందనం, వేద పారాయణం, గురుప్రార్ధన, మహన్యాసం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రుద్రాభిషేకం, రుద్రహోమం, వసోర్ధార, ఉత్తరంగా దశధర, షోడసాధనం, ప్రాయిశ్చిత్తహోమం కార్యక్రమాలు వేదోక్తంగా జరిగాయి. అనంతరం అతిరుద్ర మహాయజ్ఞ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మాతా శ్రీశ్రీశ్రీవిజయేశ్వరిదేవి నిర్వహించారు. భక్తులు విశేషసంఖ్యలో పాల్గొన్నారు.

అతిరుద్రం మహాయజ్ఞం ముగింపు సందర్భంగా మహాపూర్ణాహుతి ఇస్తున్న దృశ్యం