తెలంగాణ

ఎవరి ధీమా వారిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 20: వరంగల్ ఉప ఎన్నికలో గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు. పార్లమెంటు ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. వీరితో పాటు వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ కూడా ఎన్నికల ప్రచారాన్ని దీటుగానే కొనసాగించారు. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తమ ప్రభుత్వం గత 16 నెలలుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాలను చూసి ఓటెయ్యండని అభ్యర్థిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అంటూ అందుకు కృతజ్ఞతగా తమకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు కోరుతున్నారు.
అంతేకాకుండా గత 16 నెలల టిఆర్‌ఎస్ పాలన గాడి తప్పిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదంటూ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు చెందిన హేమాహేమీల నాయకులు ప్రచారంలో పాల్గొని హోరెత్తించారు. ప్రచార ఘట్టం ముగిసిన తరువాత ప్రధాన పార్టీలు ప్రలోభాలకు కూడా తెరలేపారు. అనేక ప్రాంతాల్లో డబ్బు పంపిణీలు కూడా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్ఛలవిడిగా పంపిణీ జరుగుతుందని చర్చ జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నందున టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కింది స్థాయి కార్యకర్తలు కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారివారికి సంబంధించిన డివిజన్‌లలో మెజార్టీ ఓట్లు సాధించాలనే పట్టుదలతో ప్రధాన పార్టీల కార్యకర్తలు తీవ్రంగానే శ్రమించారు. ఇక నిర్ణయం ఓటరు దేవుళ్లపైనే వేశారు. అభ్యర్థుల భవితం ఈ నెల 24న వెలువడనుంది. అప్పటి దాకా అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.

వరంగల్ ఉపఎన్నిక నిర్వహణకు సన్నద్ధమవుతున్న సిబ్బంది... ఏర్పాట్లను సమీక్షిస్తున్న కలెక్టర్ వాకాటి కరుణ