తెలంగాణ

ప్రజా కళాకారుడు కోటిని విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రజాకళామండలి కార్యదర్శి కోటిని కోర్టులో హాజరుపరచి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్, కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారని వారు ఆరోపించారు. ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాకళాకారుడు కోటి గుంటూరులో ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. రాజధాని పేరుతో విధ్వంసం జరుగుతున్న సంఘటనలను ప్రజాకళామండలి వ్యతిరేకిస్తోందని, అందుకే కోటిని పోలీసులు కిడ్నాప్ చేశారని జాన్, నారాయణరావు ఆరోపించారు. ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు ఒంగోలు కోర్టులో హాజరు పరిచారని, కోటి చేసిన తప్పేంటని వారు ప్రశ్నించారు. కోటి ప్రజలను చైతన్యం చేయడం, ప్రజాసమస్యలపై తన పాటల ద్వారా చైతన్య భావనను ఆవిష్కరించారన్నారు. ప్రజాకళామండలి కార్యదర్శి కోటికి ఎలాంటి ప్రాణ హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.