తెలంగాణ

కూతకొచ్చిన మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: కాగితాలపై ప్రతిపాదనల స్థాయినుంచి అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న హైదరాబాద్ మెట్రో రైలు ఎట్టకేలకు నగరవాసులకు ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఉగాదికే నాగోల్ నుంచి మెట్టుగూడ కారిడార్‌లో మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేసినా, ఫలించకపోవటంతో ఈసారి రెండు కారిడార్లలో కనీసం 25 కిలోమీటర్ల మేరకైనా మెట్రో రైలును నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కారిడార్ 3లోని నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు, అలాగా కారిడార్ 1లోని మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ వరకు ఇప్పటికే సిద్ధమైన కారిడార్‌లో పలుసార్లు జరిపిన ట్రయల్ రన్ లోపాలు లేకుండా విజయవంతం కావటంతో ఇక రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఉగాది రోజున ప్రారంభించాలా? లేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించాలా? అన్న అంశంపై సర్కారు నుంచి అధికారులు స్పష్టత తీసుకోనున్నారు. ఈ రెండు ముహూర్తాలకు సర్కారు అంగీకరించని పక్షంలో స్వాతంత్య్ర దినోత్సవమైన పంద్రాగస్టుకైనా అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
గరిష్ఠ టికెటు రూ.25కు పెంచే యోచన
నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్న జంట నగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పట్టాలెక్కముందే కనిష్ఠ, గరిష్ఠ టిక్కెటు
ధరలు సవరించాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా 2007 ప్రకారం మెట్రో రైలు ఛార్జీలు కనిష్ఠంగా రూ.8, గరిష్ఠంగా రూ.12గా నిర్ణయించిన సంగతి తెలిసిందే! చెన్నై మెట్రో రైలు కోయంబెడు నుంచి ఆలందూర్ వరకు కేవలం పది కిలోమీటర్ల దూరానికి రూ.40 వరకు టికెట్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. త్వరలో మన మహానగరంలో అందుబాటులోకి రానున్న మెట్రో చార్జీల ప్రతిపాదనలు తయారు చేసిన సమయంలో నిర్ణయించిన టికెటు ధరలే నేటికీ ఉన్నాయని, వాటిని సవరించుకోల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. గరిష్ఠ టికెటు ధర రూ.12 నుంచి కనీసం రూ.25కు సవరించాలని త్వరలోనే సర్కారుకు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నారు.