తెలంగాణ

మిషన్ భగీరథపై గవర్నర్ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మిషన్ భగీరథ పనుల పురోగతి పరిశీలనకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు హెలిక్యాప్టర్‌లో మెదక్ జిల్లా గజ్వేల్, వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లా ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మెదక్ జిల్లా గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాక, వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, నల్లగొండ జిల్లా ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నట్టు సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఏప్రిల్ 30నాటికి మంచినీటిని అందించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గవర్నర్‌కు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పనుల పురోగతిని చూపించనున్నారు.