తెలంగాణ

పోలింగ్ @ 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: జిహెచ్‌ఎంసి పోలింగ్ స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా జరిగిందని, మంగళవారం సాయంత్రం అయిదు గంటలవరకు 150 డివిజన్లలోని 7802 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 45శాతం పోలింగ్ నమోదైందని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గత 2009 ఎన్నికల్లో 42.92 శాతం పోలింగ్ కాగా, ఇపుడైన పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఈ సారి దాదాపు 2.8శాతం పెరిగిందని ఆయన వివరించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించిన పోలింగ్‌లో గత 2009 ఎన్నికలంటే ఎక్కువ మంది ఓటర్లు పాల్గొన్నారని తెలిపారు. పోలింగ్ ముగిసే అయిదు గంటల్లోపు ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బూత్‌లలోకి అనుమతించామని, పలు డివిజన్ల నుంచి ఇంకా గణాంకాలు రావల్సి ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటిస్తున్న 45శాతంలో మంగళవారం రాత్రి వరకు స్వల్పంగా మార్పు జరిగే అవకాశముందని ఆయన వివరించారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే తొమ్మిది ప్రాంతాల్లో ఇవిఎంలు మొరాయించాయని, విషయాన్ని వెబ్‌కాస్టింగ్‌లో గమనించి, వెంటనే అక్కడకు ఇంజనీర్లను పంపించి వాటిని రిప్లెస్‌మెంట్ చేసినట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న సంఘటనలు పోలింగ్ బూత్‌ల బయట జరిగినవని, వాటికి ఎన్నికల అథారిటీతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో వారు చేస్తున్న రీపోలింగ్ డిమాండ్‌ను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయా పోలింగ్ బూత్‌ల ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించి, రిటర్నింగ్ అధికారి రిపోర్టును గమనించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపుతామని వివరించారు. అంథుల కోసం అందుబాటులో ఉంచిన బ్రెయిలీ లిపి బ్యాలెట్‌ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారని వివరించారు.
మధ్యాహ్మానికి ఫలితాలు
మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఇవిఎంలు ఆయా ప్రాంతాల్లో కేటాయించిన 24 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలోని స్ట్రాంగ్ రూంలకు చేరుకుంటాయని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపును ఈ నెల 5వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆయన కొన్ని డివిజన్లకు సంబంధించి ఫలితాలు ఉదయం పది గంటల వరకు వెలువడే అవకాశాలున్నాయని, అన్ని డివిజన్ల ఫలితాలను ప్రకటించే అవకాశాలున్నట్టు ఆయన తెలిపారు.
chitram...
వివరాలు వెల్లడిస్తున్న గ్రేటర్ కమిషనర్