తెలంగాణ

15రోజుల్లో అజెండా ప్రకటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదిహేను రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలంగాణ ఐటి, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె తారక రామారావు తెలిపారు. మున్సిపల్ శాఖను చేపట్టిన తరువాత తొలిసారిగా బుధవారం ఆయన సమీక్ష జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం పెంచుకోవడానికి అధికారులకు పలు సూచనలు చేసినట్టు మీడియాకు తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించారు. 30 రోజుల్లో భవన నిర్మాణాలకు అవసరం అయిన అన్ని అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. మెరుగైన సేవలందించటంతో పాటు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు స్వల్పకాలిక, మధ్య తరహా, దీర్ఘకాలిక అనే మూడు రకాల కార్యచరణలను సిద్ధం చేయనున్నట్లు, ఇది మరో పదిహేను రోజుల్లో పూర్తికానున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. భనవ నిర్మాణ దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతలు ఇచ్చే విధంగా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వివిధ రంగాల నిపుణులతో మంత్రులు, కార్పొరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కెటిఆర్ తెలిపారు. వచ్చే వంద రోజుల్లో ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చే విధానాన్ని గ్రేటర్‌లో ప్రారంభించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ ఉండవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిహెచ్‌ఎంసిలో అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకోవలసిన చర్యలపై కెటిఆర్ అధికారులతో మాట్లాడారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించేది, ఎంత కాలంలో పూర్తి చేసేది సాధ్యాసాధ్యాలు, నిధులు, ప్రయోజనాలు తదితర అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు. గ్రేటర్ కార్యకలాపాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించే విధంగా కార్యాచరణ ఉండాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని, అందువల్ల పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు రోడ్లపై గుంతలు, చెత్త కుప్పలు వంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటుంటారని, ఇలాంటివి సత్వరమే పరిష్కారమయ్యేందుకు వీలుగా ప్రతి రెండు, మూడు కిలోమీటర్లకు ఓ ఇన్‌చార్జి అధికారిని నియమించి, సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.జి.గోపాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రోరైలు ఎండి డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మున్సిపల్ శాఖను చేపట్టి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్