క్రీడాభూమి

కోల్‌కతాలో భారత్-పాక్ టి-20 మ్యాచ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా దాయాది దేశాలైన భారత్, పాక్ జట్ల మధ్య ఈనెల 19న జరగాల్సిన మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఆరునెలల క్రితం ఖరారైన షెడ్యూల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. కాగా ఇప్పుడు ఆ వేదిక కోల్‌కతాకు మారే అవకాశం ఉంది. ఈమధ్య పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై తీవ్రవాదులు దాడి చేయడం, వారికి పాకిస్తాన్ తోడ్పాటు అందించడంపై హిమాచల్‌లో పనిచేస్తున్న సైనికుల కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నాయి. ధర్మశాలలో మ్యాచ్ నిర్వహణపై వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు రాష్ట్రప్రభుత్వం తరపున భద్రత కల్పించలేమని స్వయంగా ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బిసిసిఐ ప్రతినిధి హిమాచల్ ప్రభుత్వంతోజరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.