క్రీడాభూమి

టి-20 ప్రపంచ కప్ నుంచి ఐర్లాండ్, నెదర్లాండ్స్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ నుంచి నెదర్లాండ్స్ జట్టు నిష్క్రమించింది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం ఒమన్‌తో జరగాల్సిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్ వర్షం వలన తుడిచిపెట్టుకుపోవడంతో నెదర్లాండ్స్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. అంతకుముందు ఒమన్ జట్టు టాస్ గెలిచి నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యపడలేదు. గ్రూప్-ఎలో ఇంతకుముందు బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కూడా వర్షం వల్ల అర్థాంతరంగా ఆగిపోయంది. కేవలం 12 ఓవర్లకు కుదించి ఈ మ్యాచ్‌ను నిర్వహించాలనుకున్నప్పటికీ వరుణుడు ఒప్పుకోలేదు. 8 ఓవర్లలో బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు సాధించిన తర్వాత మళ్లీ వర్షం ఆరంభమై ఐర్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.