క్రీడాభూమి

పరుగుల వేటలో భారత్ తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మార్చి 12: టి-20 వరల్డ్ కప్‌లో రెండో వామప్ మ్యాచ్ ఆడిన భారత జట్టు పరుగుల వేటలో తడబడి, చివరికి మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికాను ఓడించేందుకు 197 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మొదలైంది. కేల్ అబోట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (10) ఎల్‌బి గా వెనుదిరిగాడు. అయతే, శిఖర్ ధావన్ 73, సురేష్ రైనా 41 పరుగులు చేసి జట్టును ఆదు కున్నారు. వీరిద్దరూ రిటైర్ అవుట్‌కాగా, చివరిలో యువరాజ్ సింగ్ 16, కెప్టెన్ ధోనీ 31 పరు గులతో నాటౌట్‌గా నిలవగా, భారత్ 5 వికెట్లకు 193 పరుగులు చేయగలిగింది.అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్ 56 పరుగులు చేసిన తర్వాత, సహచరులకు బ్యా టింగ్ ప్రాక్టీస్‌ను కల్పించే ఉద్దేశంతో రిటైర్డ్ అవుటయ్యాడు. జీన్ పాల్ డుమినీ 67 పరుగు లతో రాణించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మెరుగైన విశే్లషణను నమోదు చేశాడు. అతను 36 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ 37 పరుగులకు 2, జస్‌ప్రీత్ బుమ్రా 51 పరుగులకు 2 చొప్పున వికెట్లు సాధించారు.