తెలంగాణ

జగిత్యాల తహశీల్ ఆఫీసు జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టును ఆశ్రయించిన 174మంది రైతులు
భూసేకరణ కొలతల్లో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

జగిత్యాల, మార్చి 11: రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అలసత్వం కారణంగా కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లింగంపేటకు చెందిన 174మంది రైతులు 68ఎకరాల భూములకు సంబంధించి 1982వ సంవత్సరం నుండి పరిహారం కోసం ఎదురు చూసి కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం జగిత్యాల తహశీల్ కార్యాలయం సామాగ్రి జప్తు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల ప్రజలకు తాగునీటిని అందించే ధర్మసముద్రం రిజర్వాయర్ నిర్మాణం కోసం 1982లో జగిత్యాల మండలం లింగంపేట గ్రామానికి చెందిన 174మంది రైతుల వద్ద 68 ఎకరాలు భూమిని రెవెన్యూ అధికారులు సేకరించి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద దాదాపు కోటి రూపాయలు చెల్లించారు. 68 ఎకరాలకు కోటి రూపాయలు ఏ మూలం సరిపోవని మూడు పంటలు పండే భూములను కోల్పోయామని మరో మూడు కోట్లు చెల్లించాలంటూ 174 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులకు ప్రస్తుత భూమి విలువ ప్రకారం నష్టపరిహారం లెక్క కట్టి చెల్లించాలని ఆదేశిస్తూ గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఆదేశాలు బేఖాతారు చేసిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాగ్రి జప్తుకు హైకోర్టు పూనుకుంది. మొదటిసారి కార్యాలయం జప్తు కాగా అప్పటి కలెక్టర్ తన పూచికత్తు మీద తిరిగి జగిత్యాల తహశీల్ కార్యాలయం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు రెవెన్యూశాఖ అధికారులు నష్ట పరిహారం చెల్లింపులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు తిరిగి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తహశీల్ కార్యాలయం సామాగ్రి జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతోకంప్యూటర్, ఫర్నిచర్‌ను జగిత్యాల స్పెషల్ సబ్ కోర్టు రెండో అదనపు జడ్జి పి. రంజన్‌కుమార్ సమక్షంలో జప్తు చేశారు.