ఈ వారం తార

జయించా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా తాజాగా తనలో మంచి నటి వుందని నిర్ణయించే పాత్రలను ఎంచుకుంటోంది. ఇటీవల ఆమె ‘బాహుబలి’లో చేసిన పాత్ర అలాంటిదే. ప్రస్తుతం ‘ఊపిరి’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలలో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అయితే, సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగా జరిగిందేనని, అసలు నటి అవ్వడం తనకు ఇష్టం లేదంటోంది. అదృష్టం అలా వుంటే ఏం చేస్తామని, అందుకే నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అసలే సిగ్గరినైన తాను పరిశ్రమలోకి వచ్చి అనేక విషయాలను తెలుసుకున్నానని, ఇంకా చెప్పాలంటే ఎన్నో గుణపాఠాలను చదివానని వేదాంత ధోరణితో చెబుతోంది. అనేక అనుభవాలతో తాను ఓ రకంగా జీవితంలో జయించానని చెబుతోంది. మొత్తానికి కెరీర్ రెండో స్టేజీలోకి వెళ్ళేసరికి తమన్నాకు వేదాంత ధోరణి అబ్బింది. ఇది ఎటువైపునకు దారితీస్తుందో కాలమే చెప్పాలి.