రాష్ట్రీయం

చెరువులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబ్జాల బారినుంచి కాపాడండి
గ్రేటర్ పరిధిలో 169 చెరువులు
సుందరీకరణకు 100 కోట్ల నిధులు
మెదక్, నల్లగొండలో మినీ ట్యాంక్‌బండ్‌లు
రూ. 20 కోట్ల నిధులు మంజూరు

హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగరంలోని చెరువులకు మహర్దశ పట్టబోతోంది. కబ్జాలను నివారించడంతోపాటు చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం నడుంబిగించింది. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం నగరంలోని చెరువులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి 625 చదరపు మీటర్లుకాగా, ఈ పరిధిలో మొత్తం 169 చెరువులున్నాయి. జంట నగరాల పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 133 చెరువులు, మెదక్ పరిధిలో 10 చెరువున్నాయి. వీటిని కబ్జాల బారినుంచి పరిరక్షించి, సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే 155 చెరువుల సర్వే పూరె్తైందని, మిగిలిన 14 చెరువుల సర్వే డిఫెన్స్, రెవెన్యూ అధికారుల సహకారంతో నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సర్వేలు పూరె్తైన 155 చెరువులకు 64 చెరువుల్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటికోసం వంద కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 37 చెరువులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూరె్తైంది. 14 చెరువుల్లో పనులు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. మరో 12 చెరువులకు సంబంధించి టెండర్ ఒప్పందాలు పూర్తి చేసుకొని పని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒప్పందాలు కుదుర్చుకున్న చెరువుల్లో వారంలోపు పనులు ప్రారంభం కావాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూరె్తైన 37 చెరువుల పనుల వేగం పెంచాలని సూచించారు. మహానగరంలో చెరువుల కబ్జాకు పాల్పడేవారి విషయంలో రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంజూరైన పనుల్లో ఆలస్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి చేయాలని, లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులను హెచ్చరించారు. రామంతపూర్ చెరువును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజలు, గంగపుత్ర సంఘవాసులు వినతిపత్రాలు ఇచ్చారని, వాటిని పరిశీలించి తగు చర్య తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. చిన్నచెరువు, పెద్దచెరువు అంచనాలను తయారు చేసి పనులు ప్రారంభించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల విషయంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకోవాలని అధికారులకు తెలిపారు. దీనికోసం అడ్వకేట్ జనరల్‌ను తక్షణం సంప్రదించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ అంశంలో సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు సహకారం తీసుకోవాలన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువుల నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా కొత్తగా వాట్స్ ఆప్ గ్రూప్‌ను రూపొందించారు.
మినీ ట్యాంక్‌బండ్‌లకు రూ.20కోట్లు
చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మెదక్, నల్లగొండ జిల్లాల్లోని మినీ ట్యాంక్‌బండ్‌ల కోసం 10.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు జిల్లాల్లో ఎంపిక చేసిన చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తారు. మెదక్ జిల్లాలోని పిట్లం, గోసముద్రం చెరువు అభివృద్ధికి 9.5 కోట్లు, నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని సద్దుల చెరువు అభివృద్ధికి 10.5 కోట్లు మంజూరు చేశారు.
(చిత్రం) చెరువులపై అధికారులతో సమీక్ష జరుపుతున్న హరీశ్‌రావు