రుచి

పెండలంతో వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుంప జాతికి చెందిన పెండలం వాడకం ఆహార పదార్థాల్లో తక్కువే. విలువైన పోషకాలున్న ఈ దుంపలతో చేసే విభిన్నమైన వంటలు మంచి రుచినే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, పొటాషియం, పీచు వంటి పోషకాలు వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని పెంచేందుకు దోహదపడతాయి. పెండలం ఆకులను నీటిలో మరగబెట్టి తాగితే విరేచనాలు, తలనొప్పి, తిమ్మిర్లు తగ్గుముఖం పడతాయి. చేదు తగ్గడానికి పెండలం ఆకుల రసంలో కాస్త తేనె వేసుకుని తాగితే శరీరం తక్షణం శక్తిని పుంజుకుంటుంది. పెండలంతో పలురకాల కూరలు, చట్నీలు, గ్రేవీలు, కెబాబ్‌లు, పులుసు, చిప్స్ వంటివి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘తెల్లకంద’గా వ్యవహరిస్తారు.

చిప్స్
పెండలం - 1 కేజీ
కారం - 1/2 కప్పు
పుట్నాల పప్పు - 1 కప్పు
వేరుశెనగ పప్పు - 1 కప్పు
కరివేపాకు -కాస్త
నూనె - 250 గ్రా.
ఉప్పు - 5 చెంచాలు
జీలకర్ర- 2 చెంచాలు
పెండలం దుంపలపై చెక్కు తీసి ఉప్పు రాసి కాసేపు ఎండలో పెట్టాలి. నీరంతా ఇగిరిపోయాక దుంప ముక్కలను సన్నగా తరగాలి. బాణలిలో నూనె కాగాక వేరుశెనగ పప్పు, పుట్నాల పప్పు, జీలకర్ర, పెండలం ముక్కలను దోరగా వేయించాలి. చివరగా ఉప్పు, కారం కలపాలి. ఈ చిప్స్‌ను సాయంత్రం వేళ స్నాక్స్‌గా తినొచ్చు.

పులుసు
పెండలం ముక్కలు - 5 కప్పులు
చింతపండు రసం - 8 కప్పులు
కొత్తిమీర - కొంచెం
నువ్వుల పొడి - 1/2 కప్పు
కరివేపాకు - కొంచెం
కొబ్బరి కోరు - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1 కప్పు
మెంతులు
- 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
ఇంగువ - కాస్త
పసుపు - కొంచెం
ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 5
ఉల్లిముక్కలు - 1 కప్పు
ఉప్పు - 2 చెంచాలు
బాణలిలో పోపులు వేయించి, అందులో కొబ్బరి కోరు కలపాలి. చింతపండు రసాన్ని మరగించాక పోపు కలపాలి. వేరే గినె్నలో ఉల్లి, పెండలం ముక్కలు ఉడికించి, మరగించిన చింతపండు రసంలో వేయాలి. చివరగా ఇంగువ, బియ్యప్పిండి కలిపి, పొంగు వస్తుండగా పులుసును కిందకు దింపేయాలి.

కూర
పెండలం ముక్కలు - 2 కప్పులు
ఉప్పు - 1 చెంచా
పసుపు - 1/2 చెంచా
ఎండుమిర్చి - 5
మినప్పప్పు, శెనగపప్పు - 4 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ -2 చెంచాలు
పచ్చిమిర్చి - 6
కరివేపాకు - కొంచెం
పసుపు, ఉప్పు వేసి పెండలం ముక్కల్ని నీటిలో ఉడికించి వార్చి పెట్టాలి.
బాణలిలో పోపులు వేయించాక అందులో నలగ్గొట్టిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పెండలం ముక్కలు, ఉప్పు కలపాలి. చివరగా నిమ్మరసం వేయాలి. ఈ కూర అన్నం, చపాతీ, పూరీల్లోకి బాగుంటుంది.

అల్లం కూర
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 కప్పు
పెండలం ముక్కలు - 4 కప్పులు
నూనె - 5 చెంచాలు
ఎండుమిర్చి - 4
కరివేపాకు - కొంచెం
పోపులు - 4 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
పసుపు - 1/2 చెంచా
ముందుగా ఉప్పు, పసుపువేసి పెండలం ముక్కలను ఉడికించాలి. బాణలిలో పోపులు వేయించి, పచ్చిమిర్చి పేస్ట్ కలపాలి. ఇందులో పెండలం ముక్కలు, ఉప్పు వేస్తే రుచికరమైన కూర సిద్ధం.

-చంద్రిక