శ్రీకాకుళం

గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 11: జిల్లాలోని గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డిసి కార్యాలయం వద్ద జిల్లాలోని గీత కార్మిక సంఘ ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను గీత కార్మిక సంఘం నేతలు కలిసి సమస్యలు ఏకరువు పెట్టడంతో మంత్రి ఆదేశాల ప్రకారం కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను అందిస్తుందని, ఎవరైనా అర్హులు పింఛను పొందనివారు ఉన్నట్లైతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో సంభవించిన హుదూద్ తుపానుకు పడిపోయిన తాటిచెట్లకు నష్టపరిహారం పొందని కార్మికులు ఎవరైనా ఉంటే చెప్పాలన్నారు. అలాగే చెట్టెక్కి పడిపోయిన కార్మికునికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని అటువంటివి జిల్లాలో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంటు మూర్తి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, 14 సర్కిళ్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, గీత కార్మికులు పాల్గొన్నారు.