జాతీయ వార్తలు

తప్పులు చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆత్మపరిశీలనలో పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నికల్లో తమ ఓటమికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనే్ల కారణమంటూ ఆరోపిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ వాదనలో పస లేదని గ్రహించిందో ఏమో తెలియదు కానీ తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్లలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ‘అవును.. మేము తప్పులు చేశాం. ఆత్మ విమర్శ చేసుకుని ఆ తప్పులను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఓటర్లకు, వలంటీర్లకు దగ్గర కావలసిన అవసరం ఉంది. సాకులు వెతుక్కోకుండా సరయిన మార్గంలో నడుచుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది’ అని కేజ్రీవాల్ శనివారం ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా తాను అనేకమంది వలంటీర్లు ఓటర్లతో మాట్లాడానని, అప్పుడు వాస్తవం ఏమిటో స్పష్టమైందని ఆయన అన్నారు. తాము తప్పులు చేసిన మాట నిజమేనని, అయితే ఆత్మ పరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని, మళ్లీ ప్రజలకు చేరువ కావలసిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయ పడ్డారు. తిరిగి పార్టీలో ప్రణాళికాబద్ధంగా మార్పులు తీసుకు రావలసిన అవసరం ఉందని అన్నారు. అలా చేయక పోతే పార్టీకి అర్థమే లేదని, ప్రజలు కూడా దీనే్న కోరుకుంటున్నారని కేజ్రివాల్ అన్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఇవిఎంలు కాకుండా బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలని వాదించిన కేజ్రివాల్ ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కూడా ఇవిఎంల రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అయితే కేజ్రివాల్ ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతలే అంగీకరించక పోవడం గమనార్హం. పార్టీ ఓటమికి ఇవిఎంలను తప్పుబట్టడం సరికాదని, ప్రజలు తమను విశ్వసించకపోవడమే ఓటమికి కారణమని కుమార్ బిశ్వాస్, భగవంత్ మాన్ లాంటి ఆప్ నేతలు వ్యాఖ్యానించడం తెలిసిందే.