తెలంగాణ

లక్ష్యం పూర్తి చేస్తే ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద రోజుల ప్రణాళికపై మంత్రి కెటిఆర్
పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష

హైదరాబాద్, మార్చి 10: వంద రోజుల లక్ష్యాన్ని పూర్తి చేసిన మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్టు పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలపై కెటిఆర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాపై జిల్లా యంత్రాంగం మరింత క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు భారంగా మారిన కరెంటు చార్జీలను తగ్గించుకునేందుకు వీధి దీపాలకు ప్రత్యేకంగా కరెంటు వైర్ ఏర్పాటుపైన దృష్టి సారించాలని అన్నారు.
ఇక మున్సిపల్ శాఖపై కలెక్టర్లతో మాట్లాడిన కెటిఆర్ వంద రోజుల ప్రణాళిక అమలుపై దృష్టి సారించాలని కోరారు. 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు 11వేల మరుగుదొడ్లను నిర్మించే లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. జూన్ రెండవ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పటికీ ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరిన్ని నిధులు ఇస్తుందని తెలిపారు.
వంద రోజుల లక్ష్యాన్ని పూర్తి చేసిన మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పారు. 25 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎల్‌ఇడి బల్బుల బిగింపు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు విద్యుత్ శాఖాధికారులతో కలిసి పని చేయాలని అన్నారు. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నందున ప్రతి మున్సిపాలిటీ, నగర పంచాయతీ డంప్ యార్డుల కోసం ఐదు నుంచి ఏడు ఎకరాల భూమి సేకరించాలని కెటిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ యం.జి. గోపాల్, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.